వైరల్ వీడియో: గాల్లోకి కుక్కని ఎగరేసిన యూట్యూబర్..!

కొంద‌రు చేసే ప‌నులు చూస్తుంటే నిజంగా మ‌తి స్థిమితంలోనే ఉండి చేస్తున్నారా అనిపిస్తుంది.వారి పైశాచిక ఆనందం కోసం వారు చేసే ఘోరాలు అలా ఉంటాయి మ‌రి.

 Youtuber Arrested For Flying Pet Dog On Hydrogen Balloons, Delhi Youtuber, Pet D-TeluguStop.com

అవి ఒక్కోసారి మితిమీరి ఇత‌రుల ప్రాణాల మీద‌కు కూడా తెస్తుంటాయి.ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే అంద‌రినీ కోపానికి గురి చేస్తోంది.

ఓ కుక్క‌పై కొంద‌రు చేసిన ప‌ని చాలా దారుణంగా ఉంది.
చాలామంది జంతువులను హింసలు పెడుతూ.

ఒక్కోసారి కనికరం లేకుండా వాటి ప్రాణాలు కూడా తీస్తుంటారు.గతంలో కొందరు ఆకతాయిలు కుక్కపిల్లల్ని నిప్పుల్లో వేసి పైశాచిక ఆనందం పొందిన ఘ‌ట‌న ఎంత దుమారం రేపిందో చూశారు.

అది జ‌రిగిన త‌ర్వాత మరోచోట కోతికి ఉరివేసి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారు కొంద‌రు దుర్మార్గులు.ఇప్పుడు మ‌రోటి పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా ఓ యూట్యూబర్ తన పెంపుడు కుక్కపై పైశాచికంగా ప్రవర్తించాడు.మూగ‌జీవి అని కూడా చూడ‌కుండా దాన్ని చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు.త‌న పైశాచిక ఆనందం కోసం కుక్క‌కు హైడ్రోజన్ బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరేశాడు.ఆ బెలూన్లతోపాటు కుక్కకూడా పైకి వెళ్ళింది.ఈ దారుణ‌మైన ఘటన ఢిల్లీలోని మాలవ్యనగర్ లో చోటుచేసుకుంది.
గౌరవ్ జాన్ అనే యూట్యూబర్ త‌న ఛానల్ వ్యూస్ కోసం కుక్కను ఇలా హింస‌పెట్టి దాన్ని వీడియో తీశాడు.

త‌న బర్త్ డే సందర్బంగా ఈ విధంగా చేశాడు.దీన్ని కాస్తా డ్యూట్యూబ్ లో అప్లో చేశాడు.అంతే ఇది చూసిన వాళ్లు దుమ్మెత్తి పోశారు.చివ‌ర‌కు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు యూట్యూబర్ జాన్ పై కేసు న‌మోదు చేశారు.వీరిపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఇలా ఎందుకు చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఇక పోలీసులు జాన్ త‌ల్లిపై కూడా కేసును న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

వారంద‌రూ క‌లిసే ఇలా చేశార‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube