గ్రేట్‌ : ఈ పోలీస్‌ తన జీతంలో సగం హెల్మెట్‌లకే ఖర్చు చేస్తున్నాడు, ఎందుకో తెలుసా?  

Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-delhi Traffic Cop Sandeep Saahi,sandeep Saahi,telugu Viral News Updates,viral In Social Media

మన చుట్టు ఉన్న వారు ఏమైతే మనకేంటి మనం మాత్రం సంతోషంగా ఉండాలి, మనం మాత్రమే బాగుండాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు.కాని ఒక్కరు ఇద్దరు మాత్రం మనతో పాటు మన చుట్టు ఉన్న వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.

Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-delhi Traffic Cop Sandeep Saahi,sandeep Saahi,telugu Viral News Updates,viral In Social Media Telugu Viral News-Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-Delhi Sandeep Telugu Viral News Updates In Social Media

అలా కోరుకున్న వారిలో ముందుండే వ్యక్తి సందీప్‌ సాహి.ఈయన వృత్తిరీత్యా పోలీసు.ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేసే సందీప్‌ సాహి మరియు ఆయన భార్య ఇద్దరు కూడా ఈ సమాజానికి చాలా ఆదర్శనీయం అని చెప్పాలి.ఎందుకంటే వారు చేసే పని ఈ సమాజయంలో ఎవరు చేయక పోవచ్చు.

 

Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-delhi Traffic Cop Sandeep Saahi,sandeep Saahi,telugu Viral News Updates,viral In Social Media Telugu Viral News-Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-Delhi Sandeep Telugu Viral News Updates In Social Media

ఇంతకు సందీప్‌ సాహి చేస్తున్న పని ఏంటో తెలుసా.ప్రతి నెల తనకు వచ్చే రూ.45 వేల జీవితంలో సగం వరకు హెల్మెట్స్‌ కొనుగోలు చేసి రోడ్డుపై హెల్మెట్స్‌ లేకుండా తిరిగే వారికి ఇస్తూ ఉంటారు.హెల్మెట్‌ లేకుండా తిరగడం వల్ల ఫైన్‌ వేసే పోలీసులను చూశాం.

కాని ఈ పోలీస్‌ మాత్రం హెల్మెట్‌ లేకుండా స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసిన హెల్మెట్‌ను ఇస్తారు.ఢిల్లీలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా హెల్మెట్స్‌ను ఈ జంట పంపిణీ చేసి ఉంటుందని ఒక పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

  గత కొన్ని సంవత్సరాలుగా ఏదైనా ప్రత్యేక రోజుల్లో లేదంటే తమ జీతం వచ్చిన నెలారంభంలోనో ఏదో ఒక సందర్బంలో ఖచ్చితంగా హెల్మెట్స్‌ను బహూకరిస్తూ వస్తున్నారు.వీరు చేస్తున్న ప్రతి పనికి అందరి నుండి ప్రశంసలు దక్కాయి.

సందీప్‌ భార్య సునయన కూడా హెల్మెట్స్‌ పంపిణీలో తనవంతు భాగస్వామ్యులు అవుతారు.ఎంతో మంది హెల్మెట్స్‌ లేకుండా ఉండటం వల్ల యాక్సిడెంట్స్‌ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు.

అందుకే వీరు ఈ పని చేస్తున్నారు.

పలు మీడియా సంస్థలు సందీప్‌ చేస్తున్న పనిని అభినందిస్తూ కథనాలు ప్రసారం చేశాయి.

ఆ సందర్బంగా సందీప్‌ను ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మీ డబ్బులు ఖర్చు చేసి హెల్మెట్స్‌ ఇవ్వడంకు గల కారణం ఏంటీ అంటూ ప్రశ్నించారు.అందుకు సందీప్‌ మాట్లాడుతూ.దేశ వ్యాప్తంగా టూ వీలర్‌ ప్రమాదాల్లో 70 శాతానికి పైగా మరణాలు తలకు బలమైన గాయాలు సంభవించడం వల్లే జరుగుతున్నాయి.హెల్మెట్‌ పెట్టుకుంటే కనీసం 50 శాతం మరణాలు అయినా ఆపేయవచ్చు.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను బండిపై తీసుకుని వెళ్తున్నాడు.ఆ బండిని వెనుక నుండి కారు బలంగా గుద్దింది.

  దాంతో బండిపై ఉన్న వ్యక్తి, పిల్లలు మొత్తం కూడా రోడ్డుకు బలంగా గుద్దుకున్నారు.వారు ముగ్గురు కూడా తల పగిలి చనిపోవడం నా కళ్ల ముందు జరిగింది.

అందుకే అప్పటి నుండి నేను హెల్మెట్స్‌ ఇస్తున్నట్లుగా సందీప్‌ చెప్పుకొచ్చాడు.గిఫ్ట్‌ అంటే ఎన్నో ఇవ్వొచ్చు.కాని ప్రాణాలను కాపాడే గిఫ్ట్‌ మాత్రం హెల్మెట్‌.అందుకే నేను నా భార్య కలిసి వాహనదారులకు హెల్మెట్స్‌ గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకుని ఇలా చేస్తున్నామని సందీప్‌ అన్నాడు.

ఆయన చేసిన పనులకు పలు స్వచ్చంద సంస్థ వారు సన్మానించడంతో పాటు అభినందించారు.

.

తాజా వార్తలు

Delhi Traffic Cop Sandeep Saahi Gifted Helmets To Bike Raiders-delhi Traffic Cop Sandeep Saahi,sandeep Saahi,telugu Viral News Updates,viral In Social Media Related....