పొట్టకూటి కోసం పకోడీలు అమ్ముతున్న టీచర్..!

పొట్ట కూటి కోసం అని ఎంతోమంది వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోయినా ఏదో ఒకటి అని వెళ్లిన వారి సంఖ్య ఎక్కువే.కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరి ఎప్పుడు పర్మినెంట్ అవుతాయా అని ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువే.

 Teacher Selling Pakodi, Delhi Teacher, Covid-19, Corona Virus, Survival-TeluguStop.com

ఇంకా అలాంటి వారు అంత కూడా ప్రస్తుతం కోవిడ్ 19 కి బలైపోయారు.

కోవిడ్ 19 కారణంగా ఉద్యోగాలు పోయి ఆర్ధికంగా కష్టాలు పడుతున్నారు.

ఇంకా అలా కష్టాలు పడే వారిలో టీచర్లు ఎక్కువగా ఉన్నారు.ఏదో ఒక పాఠశాలలో కాంట్రాక్ట్ కింద చేరి పాఠాలు చెప్పాల్సిందే.

అలాంటి వారి ఉద్యోగాలు ఎప్పుడు పర్మినెంట్ అవుతాయో చెప్పడం కష్టమే అయినప్పటికీ చాలీ చాలని జీతాలతోనే జీవితాన్ని నెట్టుకొచ్చేవారు.

అలాంటిది కోవిడ్ 19 కారణంగా ఉద్యోగాలు పోయి జీవితాలు దయనీయంగా మారాయి.

పాఠశాలు మూసివేయడంతో కాంట్టాక్ట్ టీచర్లకు జీతాలు నిలిచిపోయాయి.ఎంతోమంది టీచర్లు పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్‌లో కాంట్రాక్టు టీచర్‌గా పనిచేసిన అబ్దుల్ కదీర్ పరిస్థితి ఇలాగే మారింది.

మే 10వ తేదీ నుంచి ఆయనతోపాటు సుమారు 3వేల మంది కాంట్రాక్ట్ టీచర్ల జీతాలు నిలిచిపోయాయి.

దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది.ఉపాధి కోసం వేరే మార్గం లేకపోవడంతో కదీర్ ఇప్పడు పకోడీలు అమ్ముతున్నారు.

కాగా గత మూడు నెలలుగా ఎంతోమంది టీచర్లు కుటుంబం కోసం కాయగూరలు, పండ్లు అమ్ముతున్నారు.ఏది ఏమైనా కోవిడ్-19 అందరి జీవితాలను పూర్తిగా మార్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube