వార్నింగ్‌లు ఇస్తున్న ఢిల్లీ అధిష్టానం.. సైలెంట్ అవుతున్న కాంగ్రెస్ నేత‌లు!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంట‌లు చ‌ల్లారుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు కాస్త భ‌గ్గ‌మన్న‌ట్టు కనిపించిన నేత‌లంతా ఇప్పుడు కాస్త సైలెంట్ అవుతున్నారు.

 Delhi Supremacy Giving Warnings Congress Leaders Becoming Silent, Revanth, Congr-TeluguStop.com

ఎందులో అనుకుంటున్నారా అదేనండి రేవంత్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా నియ‌మించిన‌ప్ప‌టి నుంచి టీకాంగ్రెస్‌లో అస‌మ్మ‌తి వ‌ర్గం చెల‌రేగిపోతోంది క‌దా.ఆ విష‌యంలో ఢిల్లీ అధిష్టానం సీరియ‌స్‌గా ఉంటుందంట‌.

కాంగ్రెస్ లో ఈ అస‌మ్మ‌తులు కొత్తేమీ కాక‌పోయినా.రేవంత్ విష‌యంలో ఇవి కాస్త ఎక్కువ‌గానే ఉంటున్నాయి.

ఇప్ప‌టికే కొంద‌రు రాజీనామాలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయిఏతే రేవంత్ విష‌యంలో కొంద‌రు ముందుగా ఫైర్ అవుతున్నా ఆ త‌ర్వాత వ‌రుస‌గా చ‌ల్ల‌బ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి లాంటి కీల‌క నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఢిల్లీ అధిష్టానం పిలిచి మ‌రీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది.ఇక రేవంత్ కూడా అస‌మ్మ‌తి నేత‌లు, సీనియ‌ర్ నాయ‌కుల‌ను వ‌రుస‌గా క‌లుస్తూ త‌నకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

దాంతో చాలామంది ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నారు.ఈ విష‌యంలో రేవంత్ కాస్త స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.

Telugu @revanth_anumula, Delhi Congress, Jagga Reddy, Revanth Reddy, Tcongress M

ఇక జ‌గ్గారెడ్డి, భట్టి విక్ర‌మార్క‌, వీహెచ్ లాంటి కీల‌క నేత‌లు కూడా ముందుగా కాస్త ఫైర్ అయినా ఆ త‌ర్వాత అధిష్టానం సీరియ‌స్ తో సైలెంట్‌గా మారుతున్నారు.కాక‌పోతే ఇప్ప‌ట్లో ఒకేసారి రేవంత్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా భ‌విష్య‌త్‌లో ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.ఇక రేవంత్ కూడా త‌న వ్యూహం ప్ర‌కారం టీపీసీసీ చీఫ్ అయి, ఇప్పుడు అధికారంలోకి రావ‌డ‌మే త‌న రెండో ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం టీఆర్ ఎస్‌పై యుద్ధానికి రెడీ అవుతున్నారు.

నిరుద్యోగం, పాద‌యాత్ర లాంటి ప్లాన్లు వేసుకుని మ‌రీ ముందుకెళ్తున్నారు.దాంతో పాటే త‌న‌కు క‌లిసి వ‌చ్చే వారిని ఒక్కొక్క‌రిగా క‌లుస్తూ అండ‌గా నిల‌వాల‌ని కోరుతున్నారు.

చూడాలి మ‌రి ఆయ‌న ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube