కంగానాకు పిచ్చి ముదిరింది.. మెంటల్ అస్పత్రికి పంపండి.. సిక్కులు కామెంట్స్ వైరల్ ?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 Delhi Sikh Gurudwara Files Complaint Against Kangana Details,  Delhi, Sikh Gurdw-TeluguStop.com

ఇప్పటికే చాలాసార్లు ఈమె మాట తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది.

ఇక ఇటీవలే దేశ స్వాతంత్రం పై కంగనారనౌత్ చేసిన వివాదాస్పద ప్రకటన వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ కారణంగా కంగానా పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.

ఆమె రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిందని, ఆమె పై చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మనిజిందర్ సింగ్స్ సిర్స డిమాండ్ చేశాడు.ఖలిస్తాని ఉగ్రవాదులు వల్లే కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్న స్టేట్మెంట్ ఇవ్వడం రైతులను అవమానపరచడమే అని ఆయన అభిప్రాయపడ్డాడు.

తనను ద్వేషపూరిత వ్యక్తిగా అభివర్ణించిన మణిజిందర్ సింగ్ ఇంస్టాగ్రామ్ లో హేట్ ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తున్న తనపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ ను కోరాడు.

Telugu Bollywood, Delhi, Kanganahate, Kangana Ranaut, Manijindersingh, Padma Sri

అంతేకాకుండా కంగానాకు వచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకుని తనను మెంటల్ హాస్పిటల్ లేదా జైలుకు తరలించాలని సూచించారు.ఆమె పై మణిజిందర్ ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈమె గతనెల పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే.

తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఖలిస్తాని టెర్రరిస్ట్లు ఈ రోజు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.కానీ ఒక్క మహిళలు మాత్రం మర్చిపోకూడదు.

ఆ మహిళ ఎవరో కాదు తన కాళ్ళ కింద నలిపివేసిన ఇందిరాగాంధీ అంటూ షేర్ చేసింది కంగనారనౌత్.ఈ క్రమంలోనే స్పందించిన నెటిజన్లు తనకు పిచ్చి ముదిరింది తనని పిచ్చాసుపత్రిలో చేర్పించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube