ఢిల్లీ టీ20 మ్యాచ్‌లో కాలుష్యం వల్ల ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిందే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బయట తిరిగే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలంటూ ప్రభుత్వం సూచించింది.

 Delhi Polution Effect On Bangla And India Cricketers-TeluguStop.com

అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఢిల్లీలో ఇండియా బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌ను నిర్వహించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ అంతా అన్నారు.కాని బీసీసీఐ మాత్రం మొదటే నిర్ణయించిన షెడ్యూల్‌ను మార్చడం వీలు కాదు అంటూ ఢిల్లీలోనే మొన్న ఆదివారం మొదటి టీ20 మ్యాచ్‌ను నిర్వహించారు.

ఆ మ్యాచ్‌లో బంగ్లా విన్‌ అయ్యింది.ఆ విషయం పక్కన పెడితే ఆ మ్యాచ్‌ సందర్బంగా బంగ్లా క్రికెటర్స్‌ అస్వస్థతకు గురయ్యారట.

విపరీతమైన కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ సౌమ్య సర్కార్‌కు కొద్ది సమయం ఊపిరి అందలేదట.దాంతో అతడు వాంతులు కూడా చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు కాని విషయం ఆనోట ఈనోట పడి బయటకు వచ్చింది.డ్రెస్సింగ్‌ రూంలో సౌమ్య సర్కార్‌ వాంతులు చేసుకోవడంతో పాటు కొద్ది సమయం ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డట్లుగా చెబుతున్నారు.

సౌమ్య మాత్రమే కాకుండా ఇంకా కొందరు ఇండియా మరియు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఢిల్లీ కాలుష్యం కారణంగా ఇబ్బందికి గురయ్యారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube