హద్దులు మీరుతున్న కుర్రతనంతో కొన్ని సార్లు అడ్డంగా బుక్ అవుతున్నారు.విదేశాలకే పరిమితం అయిన రోడ్డు మీద రొమాన్స్ అభివృద్ది చెందిన కారణంగానో ఏమో కాని ఇండియాలో కూడా మొదలు అయ్యింది.
ఇండియా అభివృద్ది చెందింది అనేందుకు ఇదే సాక్ష్యం అన్నట్లుగా రోడ్ల మీద రొమాన్స్‌లు చేస్తున్నారు.ఎంతటి వారు అయినా కాంత దాసులే అన్నట్లుగా ప్రతి ఒక్క యువకుడు లేదా యువతి కూడా ప్రేమలో ఏదో ఒక సమయంలో పడుతున్నారు.
అయితే కొందరు మాత్రం తమ ప్రేమను సీకెట్ర్గా ఉంచుకుంటే మరి కొందరు మాత్రం వీరిలా రోడ్డున పడుతున్నారు. తాజాగా ఢిల్లీ రోడ్డు మీద ఒక జంట రొమాన్స్ చేయడం వైరల్ అయ్యింది.
రోడ్డు మీద అంటే బండి పక్కకు ఆపి రోడ్డుపై ముద్దు పెట్టుకోవడం లేదంటే ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని కూర్చుని ఉండటం అంటే కొంతలో కొంత వరకు పర్వాలేదు.కాని బండి నడుపుతున్న సమయంలో హద్దుమీరి ముద్దులు పెట్టుకోవడంతో వారిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అబ్బాయి బండి తోలుతుంటే అమ్మాయి ట్యాంక్‌పై రివర్స్‌లో అతడి వైపుకు కూర్చుని ముద్దులు పెడుతుంది.అంత ట్రాఫిక్‌లో అబ్బాయి, అమ్మాయి ముద్దులు పెట్టుకుంటూ బండిపై వెళ్లడం స్థానికంగా సంచలనం అయ్యింది.
వారి ముద్దులాటను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.రోడ్డు మీద, అది కూడా బైక్ రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఇలా ముద్దులు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఢిల్లీ పోలీసులు వీరిపై సీరియస్ యాక్షన్‌కు సిద్దం అయ్యారు.యాక్సిడెంట్ అయితే కాలేదు, కాని పరిస్థితి అదుపు తప్పి యాక్సిడెంట్ అయితే వారితో పాటు పలు వాహనాలకు కూడా యాక్సిడెంట్స్ అయ్యేవి.
అందుకే మరోసారి మరెవ్వరు ఇలాంటి సంఘటనలకు సిద్దపడకుండా ఉండేందుకు పోలీసులు వారిపై సీరియస్ కేసు నమోదు చేయబోతున్నారు.
ఇక నెటిజన్స్ వీరికి కఠినంగా శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.సంవత్సరం పాటు వారిద్దరికి జైలు వేయాలని కొందరు, నెల రోజుల పాటు వారిద్దరిని కూడా ఢిల్లీ రోడ్లపై తిప్పుతూ ట్రాఫిక్ రూల్స్ ప్రచారం చేయాలని, వారు చేసిన తప్పు అందరికి తెలిసేలా చేసి, వారిద్దరికి పడ్డ శిక్షను అందరికి తెలిసేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంకా వింత వింత శిక్షలు విధించాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీరిద్దరికి ఎలాంటి శిక్ష విధించాలో మీరు కామెంట్ చేయండి.