ఢిల్లీ లిక్కర్ స్కాం : సిసోడియా అరెస్ట్ .. కంగారు పడుతున్న బీఆర్ఎస్ ? 

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది .ఈ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తూ ఉండడం తో ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వివిధ పార్టీల నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

 Delhi Liquor Scam: Manish Sisodia Arrested Tension In Brs , Delhi Likker Sca-TeluguStop.com

ఇప్పటికే ఈ స్కాంలో అనేకమంది అరెస్టు కాగా , మరెంతో మంది కీలక నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.ముఖ్యంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు.

అంతకుముందే ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ అరెస్టయ్యారు.ఇంకా అనేకమంది ఈ వ్యవహారంలో అరెస్టు అయ్యారు.

ఈ వ్యవహారంలోనే బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.త్వరలోనే ఆమెను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారాలపై బీఆర్ఎస్ ఏం చేయాలనే విషయంపై కేసీఆర్ అత్యవసర సమావేశం మూడు రోజుల క్రితం నిర్వహించారు.

Telugu Brs Mlc Kavitha, Manish Sisodia, Telangana, Ysrcp Mp-Politics

తాజాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బిజెపిని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది .తమ పార్టీలను రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తోంది.మనీష్ సిసోడియా అరెస్టు బిజెపి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానేనని, బిజెపి ఆప్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని,  ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బిజెపి జీర్ణించుకోలేక ఈ విధంగా సిసోడియాను అరెస్ట్ చేశారని బిఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

దేశంలో ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని , ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని బిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.

Telugu Brs Mlc Kavitha, Manish Sisodia, Telangana, Ysrcp Mp-Politics

 ఈ  కేసు వ్యవహారంలో మనిష్ సిసోడియా తరువాత అరెస్టు అయ్యేది కవితనే అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం తో ముందుగానే బిఆర్ఎస్ అలర్ట్ అవుతూ.  సిసోడియా అరెస్టు వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ బిజెపిని టార్గెట్ చేస్తుంది.ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారమంతా బిజెపి కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

ఒకవేళ ఈ కేసులో కవితను కూడా అరెస్ట్ చేస్తే దేశ వ్యాప్తంగా కవిత అరెస్టు వ్యవహారాన్ని హైలెట్ చేసి రాజకీయంగా బీఆర్ఎస్ కు మైలేజ్ పెంచుకునే విధంగా జనాల్లో సెంటిమెంటును రగిలించే విధంగా  బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube