విద్యుత్ కోతలను అధిగమించడానికి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే ఆవిష్కరణ చేసిన ఢిల్లీకి చెందిన యువకుడికి యూకేలో( UK ) ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ‘‘ Diana Legacy Awards ’’ అందుకున్న 20 మంది గ్రహీతలలో అతను ఒకరిగా నిలిచారు.
దివంగత వేల్స్ యువరాణి డయానా జ్ఞాపకార్థం ఈ పురస్కారాలు ఏర్పాటు చేశారు.డయానా అవార్డ్ ఛారిటీ ఈ ఏడాదితో 25వ వసంతంలోకి అడుగుపెడుతుంది.
గురువారం సాయంత్రం లండన్ సైన్స్ మ్యూజియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉదయ్ ఎలక్ట్రిక్ వ్యవస్ధాపకుడు ఉదయ్ భాటియా,( Uday Bhatia ) హ్యూసోఫ్‌తెమైండ్ ఫౌండేషన్ వ్యవస్ధాపకురాలు మానసి గుప్తాలు( Manasi Gupta ) ప్రిన్సెస్ డయానా పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం( Prince William ) నుంచి అవార్డులు అందుకున్నారు.ప్రతి రెండేళ్లకోసారి జరిగే డయానా లెగసీ అవార్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సామాజిక , మానవతా చర్యలు చేపట్టిన అసాధారణ యువతకు అందజేస్తున్నారు.
పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా ప్రిన్స్ విలియం మాట్లాడుతూ.ఈ యువకులు అనుసరించిన మార్గాలు క్లిష్టమైనవన్నారు.ధైర్యం, కరుణ, నిబద్ధత వంటి తన తల్లి పంచుకున్న లక్షణాలతో నడిపించబడ్డారని ప్రిన్స్ విలియం పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బిచ్‌పురి మురికివాడలో ఉదయ్ భాటియా 16 ఏళ్ల పాఠశాల విద్యార్ధిగా .విద్యార్ధులకు మార్గనిర్దేశం చేయడం ప్రారంభించినప్పుడు తరచుగా విద్యుత్ కోతలు తరగతులకు ఎలాంటి ఆటంకం కలిగిస్తున్నాయో చూశాడు.విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన ‘‘ Outage Guard bulb ’’ను ఆవిష్కరించాడు.
విద్యుత్ కోతల సమయంలో పది గంటల వరకు నిరంతరాయంగా ఇది పనిచేయడంతో పాటు తక్కువ ధరలోనే లభిస్తుంది.దీని ఫలితంగా 950 కుటుంబాలు స్థిరమైన, విశ్వసనీయమైన శక్తిని పొందడంతో పాటు వారి విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
సామాజిక ఆవిష్కర్తగా వుండటమంటే సమాజానికి సంబంధించిన సమస్యలను అవిశ్రాంతంగా పరిష్కరించడమని 18 ఏళ్ల భాటియా చెప్పాడు.

ఇక మానసి గుప్తా విషయానికి వస్తే .మానసిక ఆరోగ్యానికి మద్ధతు ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా 11 సెషన్‌లకు పైగా వ్యక్తిగతంగా పంపిణీ చేశారు.తన లాభాపేక్ష లేని హ్యూసోఫ్‌థెమైండ్ ఫౌండేషన్( Huesofthemind Foundation ) ద్వారా 50 వేల మందికి పైగా జీవితాలను ప్రభావితం చేసింది.200 మంది వాటాదారుల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా వినూత్న ప్రచారాలు, ప్రాజెక్ట్‌లు , ఈవెంట్‌లను మానసి నిర్వహించింది.కోవిడ్ మహమ్మారి సమయంలో గుప్తా చేసిన కృషిని భారత మాజీ ఆరోగ్య కార్యదర్శి ఐహెచ్‌డబ్ల్యూ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్) డిజిటల్ హెల్త్ అవార్డ్స్‌లో గుర్తించారు.
నిధులను సేకరించడానికి, సోషల్ మీడియా ద్వారా అవగాహనను పెంచడానికి ఇక ఇలస్ట్రేటెడ్ బుక్‌ను కూడా రూపొందించారు.