ఈ వస్త్రాలను ధరిస్తే ఇన్ఫెక్షన్స్ దరి చేరవట

ఆసుపత్రుల్లో నిత్యం రోగుల కు ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండడం కోసం బెడ్ లపై బెడ్ షీట్స్ ను ప్రతి రోజూ తప్పనిసరిగా మార్చాల్సి పడుతుంది.దీనికోసం ఆసుపత్రి సిబ్బంది రోజూ ఆ బెడ్ షీట్స్ ను మార్చి శుభ్రంగా ఉతికి వాటిని మరలా ఉపయోగించాల్సి ఉంటుంది.

 Delhi Iit Student Develops Infection Proof Fabric-TeluguStop.com

ఎందుకంటే ఇలా హైజినిక్ గా ఉంచకపోతే ఒక రోగి నుంచి మరో రోగి కి ఇన్ఫెక్షన్స్ ప్రబలుతూ ఉంటాయి.అయితే ఇదంతా చేయడానికి చాలా సమయం తో పాటు వ్యక్తులు కూడా అవసరమౌతారు.

కానీ ఒక ఐఐటీ విద్యార్థి మాత్రం ఇలాంటి ఏ జంఝాటం లేకుండా ఇన్ఫెక్షన్ రహిత నూలు వస్త్రాలను రూపొందించారు.మెడికల్‌ టెక్నాలజీ ఆధారంగా టెక్స్‌టైల్‌ కెమికల్‌ ప్రాసెసింగ్‌ విధానంలో బాక్టీరియాలు, వైరస్‌లను నిరోధించే సామర్థ్యం ఉన్న వస్ర్తాన్ని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి యతీ గుప్తా ప్రొఫెసర్‌ సామ్రాట్‌ ఉపాధ్యాయ్‌ నేతృత్వంలో అభివృద్ధి చేశారు.తాము అభివృద్ధి చేసిన ఇన్‌ఫెక్షన్‌ ప్రూఫ్‌ ఫాబ్రిక్‌.2 గంటల వ్యవధిలో 99 శాతం వ్యాధికారక క్రిములను చంపేస్తుందన్నారు.

ఆస్పత్రులను మరింత సురక్షితంగా చేయడంలో భాగంగా ఈ వస్ర్తాన్ని డెవలప్‌ చేసినట్లు తెలిపారు.ఈ వస్ర్తాన్ని బెడ్‌షీట్లు, డాక్టర్లు, నర్సులు, రోగులకు వేసే యూనిఫామ్స్‌ కోసం వాడవచ్చిన.

పూర్తి సురక్షితమైందని వారు చెబుతున్నారు.అసలుకే ఇప్పుడు ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ బెడ్ షీట్స్ బాగా ఉపయోగపడేలా కనిపిస్తుంది.

మరి ఇవి అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube