మాస్క్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేయడం కోసం ఒకపక్క వాక్సినేషన్ సెంటర్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటూ మరోపక్క కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.

 Delhi High Court Sensational Comments On Mask Delhi, High Court, Corona Positive-TeluguStop.com

అయినా గాని కేసులు లక్షల్లో బయటపడుతూ ఉండటంతో ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి.ఈ తరుణంలో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిన్నటి నుండి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

మరోపక్క కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ఢిల్లీ హైకోర్టు మాస్క్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మేటర్ లోకి వెళ్తే మాస్కు అనేది బయటకు వచ్చినప్పుడు మాత్రమే కాక కారులో వెళుతున్న సమయంలో కూడా మాస్క్ ధరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.మాస్క్ ధరించడం వల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరి కట్టగలిగిన వారవుతారని తెలిపింది.

అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని ఢిల్లీ హైకోర్టు సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube