సుజనా చౌదరి కి ఢిల్లీ హైకోర్టు లో చుక్కెదురు !

మాజీ కేంద్ర మంత్రి … టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేసి ఆయన బ్యాంకులను మోసగించారని అభియోగాలపై ఆయనకు సమన్లు కూడా జారీ చేశారు.అయితే…ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను నిలుపుదల చేయాలని కోరుతూ సుజనా చౌదరి కి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది .ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు సుజనా వాదనతో ఏకీభవించలేదు.

 Delhi High Court Rejects Sujana Chowdary Petition-TeluguStop.com

తనపై ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశంతో కూడినవని, తన కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం.అయితే, దీనిపై విచారించిన న్యాయస్థానం సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సిందేనని సుజనాకు తేల్చి చెప్పింది.సుజనాపై బలవంతంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈడీని కోర్టు ఆదేశించింది.

ఆయన 5700 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించారని ఈడీ అభియోగాలను నమోదుచేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube