ప్రేమంటే ఇదేరా.. ముగ్గురు గర్ల్‌ ఫ్రెండ్స్‌ను మెయింటెన్‌ చేసేందుకు ఆ డాన్స్‌ మాస్టర్‌ ఏం చేశాడో తెలుసా  

Delhi Dancer Allegedly Robs Auto Driver To Splurge On Girlfriends-

ప్రేమ గుడ్డిది అంటారు, గుడ్డిదే కాదు మూగది, అవిటిది కూడా అని కొందరి ప్రేమలను చూస్తే అనిపిస్తుంది.ఢిల్లీకి చెందిన రోహన్‌ గిల్‌ అనే వ్యక్తి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు.

Delhi Dancer Allegedly Robs Auto Driver To Splurge On Girlfriends--Delhi Dancer Allegedly Robs Auto Driver To Splurge On Girlfriends-

చిన్న చిన్న సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పని చేస్తూ, స్టేజ్‌ షోలు ఇస్తూ డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఎంతో మందితో అభినందనలు పొందిన రోహన్‌కు ప్రేమ దోమ కుటుంది.అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రేమ దోమలు కుట్టాయి.

Delhi Dancer Allegedly Robs Auto Driver To Splurge On Girlfriends--Delhi Dancer Allegedly Robs Auto Driver To Splurge On Girlfriends-

మూడు ప్రేమ దోమలు కుట్టడంతో అతడి పరిస్థితి ఆగం ఆగం అయ్యింది.అతడు ఏం చేస్తున్నాడో అతడికే తెలియకుండా చేశాడు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క లవర్‌ను మెయింటెన్‌ చేయడమే చాలా కష్టం అయ్యింది.ఇక మెట్రో నగరాల్లో ప్రేమ వ్యవహారాలు అయితే ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.ఇలాంటి దారుణమైన ప్రేమలు ఉన్న ఢిల్లీ నగరంలో రోహన్‌ పరిస్థితి కూడా అంతే అయ్యింది.

ముగ్గురు అమ్మాయిలు తనను ప్రేమించడంతో ఏ అమ్మాయిని వదిలేయాలనిపించలేదు.అందరితో ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు.ఎవరికి దక్కని అదృష్టం తనకే దక్కిందని సంతోషించాడు.చాలా సంతోషంగా ప్రేమంటే ఇదేరా అన్నట్లుగా వారితో తెగ ఎంజాయ్‌ చేశాడు.అంతా బాగానే ఉంది అయితే అతడి వద్ద ఉన్న డబ్బులు నిండుకున్నాయి.

ముందు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత డబ్బులు లేవు అంటే ఊరుకుంటారా, గిఫ్ట్‌లు, పార్టీలు ఇవ్వకుంటే ప్రేమ నిలబడుతుందా, నిలబడదు.అందుకే వారికి మునుపటి లాగే గిఫ్ట్‌లు ఇచ్చి, పార్టీలకు పబ్‌లకు తీసుకు వెళ్లాలనుకున్నాడు.అయితే అందుకోసం డబ్బులు కావాలి.ఆ డబ్బులను దొంగతనం చేసి సంపాదించాలని భావించాడు.గత రెండు మూడు నెలలుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు.తాజాగా ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్‌ వద్ద డబ్బులు లాక్కుని పోతూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు.

తీగ లాగితే డొంక కదిలినట్లుగా అతడి వ్యవహారం అంతా తెలిసి పోలీసులు నోరు వెళ్లబెట్టారు.ఇతడి పరిస్థితి మరో నలుగురికి రావద్దనే ఉద్దేశ్యంతో పోలీసులు ఇతడి స్టోరీని బయటకు రివీల్‌ చేశారు.

ఈ వ్యవహారం వైరల్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.