లోక్‎సభ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!!

లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) సిద్ధం అయింది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ రావడంతో విడుదలయ్యారన్న సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ ప్రచారాన్ని చేపట్టనుండటంతో ఆప్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

కాగా ఇండియా కూటమి తరపున కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.ఇందులో భాగంగా ఢిల్లీతో పాటు పంజాబ్, యూపీ మరియు బీహార్ లో కేజ్రీవాల్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

రానున్న ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం నాలుగు స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు