మరింత వెసులుబాటు కల్పించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!!

ఢిల్లీలో కరోనా తీవ్రత దాదాపు తగ్గుముఖం పట్టింది.గతంలో కంటే కేసులు చాలావరకు తగ్గిపోతుండటంతో ఇప్పటికే షాపింగ్ మాల్స్ సరి–బేసి విధానంలో ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు ఇవ్వగా తాజాగా .

 Delhi Cm Kejriwal Sensatational Decision-TeluguStop.com

వారం రోజుల పాటు పూర్తిగా దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారంరోజులపాటు చూసి ఆ తర్వాత కేసులు వస్తే తదుపరి సడలింపులు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

అన్ని రకాల షాప్స్ సోమవారం నుండి ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ఇదిలా ఉంటే విద్యాసంస్థలు మరియు సామాజిక రాజకీయ సమావేశాలు అదేవిధంగా సినిమా ధియేటర్లు, స్విమ్మింగ్ పూల్ మరియు పార్కులు, జిమ్ము లకు అనుమతి లేదని పేర్కొంది.

 Delhi Cm Kejriwal Sensatational Decision-మరింత వెసులుబాటు కల్పించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రెస్టారెంట్లకు 50% సామర్థ్యంతో ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది.ఇదంతా కేవలం వారం రోజులు మాత్రమే ఆ తర్వాత కేసులు పరిస్థితి బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక అదే రీతిలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని ప్రవేట్ ఆఫీసులో సగం సామర్థ్యంతో ఓపెన్ చేయాలని స్పష్టం చేసింది. 

.

#Restaurants #DelhiCm #Delhi Lockdown #CovidCases #Kejriwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు