ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ అనే కొత్త ప్రమాదకర కరోనా వేరియంట్ భారీగా వ్యాప్తి చెందుతూ ఉంది.డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తూ ఉండటంతో… ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి.
సరిహద్దులను క్లోజ్ చేసి.అంతర్జాతీయ విమాన రాకపోకలు విషయంలో కీలక ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒమిక్రాన్ వైరస్ విషయంలో అలసత్వం చేయకూడదు అంటూ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆపేయాలని సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది అని.ఈ క్రమంలో ప్రపంచంలో చాలా దేశాలు దక్షిణాఫ్రికా సహా ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన దేశాల నుండి రాకపోకలు నిలిపేశాయి.మరింత ప్రమాదకర వైరస్ విషయంలో భారత్ ఎందుకు అలసత్వం చేస్తోంది అని ప్రశ్నించారు.మొదటి దశలో కూడా ఈ విధంగానే వ్యవహరించడం జరిగింది.తద్వారా ఎక్కువ అంతర్జాతీయ విమానాలు ఢిల్లీలోకి రావడంతో వైరస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి.ఇప్పుడు ఇదే రీతిలో వ్యవహరిస్తూ ఉంది ఆ వైరస్ ప్రభావం ఢిల్లీ నగరంలో ఎక్కువ ప్రభావితం అవుతుంది … సార్ దయచేసి అంతర్జాతీయ విమాన రాకపోకలు నిలిపివేయండి ఆరోగ్య శాఖ అధికారులు చొరవ తీసుకోండి అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా వేడుకొన్నారు.