ప్రజలే ప్రత్యేక ఆహ్వానితులు  

Delhi Cm Kejriwal Oath-delhi Peoples,kejriwal,kejriwal Third Time Oath In Delhi Cm

ఢిల్లీ సీఎంగా మూడవ సారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యారు.బంపర్‌ మెజార్టీతో బీజేపీ మరియు కాంగ్రెస్‌లను చిత్తు చేసి ఆప్‌ మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచిన విషయం తెల్సిందే.

Delhi Cm Kejriwal Oath-Delhi Peoples Kejriwal Third Time Oath In

ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌పై నమ్మకంతో హస్తిన ప్రజలు మరోసారి ఆయన్ను సీఎంగా ఎంపిక చేసుకున్నారు.ఇక మూడవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆప్‌ భారీ ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.


ఈనెల 16వ తారీకున సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేజ్రీవాల్‌ దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులను.ప్రధాని.కేంద్ర మంత్రులను తన ప్రమాణ స్వీకారంకు ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా ఆవిషయమై ఆప్‌ నేతలు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక్కరిని కూడా పిలవలేదు.

ఢిల్లీ ప్రజలంతా ఈ ప్రమాణ స్వీకారంకు రావాలని కోరుకుంటున్నాం.ప్రజలే ప్రత్యేక ఆహ్వానితులుగా కేజ్రీవాల్‌గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఆప్‌ నేతలు ప్రకటించారు.

తాజా వార్తలు