ఢిల్లీ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...సీఎం కీలక నిర్ణయం

దేశరాజధాని ఢిల్లీ లో మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షన్నర కు పైగా నమోదు కాగా, మరణాల సంఖ్య 4 వేలకు పైగా ఉంది.

 Delhi Cm Kejriwal Took The Key Decision About Covid Cases , Delhi Cm Kejriwal, C-TeluguStop.com

అయితే మంగళవారం తాజాగా ఢిల్లీ లో 1,500 లకు పైగా కేసులు నమోదు కావడం తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటివరకు రోజుకు 20 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తుండగా,ఇకపై ఆ సంఖ్య ను 40 వేలకు పెంచనున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని, ప్రతి ఒక్కరూ ఈ పరీక్షల కోసం ముందుకు రావాలి అని ఏమాత్రం సిగ్గుపడకూడదు అంటూ ఆయన పిలుపునిచ్చారు.

కరోనా లక్షణాలు ఉన్న ఎవరూ కూడా భయపడకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని, సీఎం కోరారు.కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కోరలు చాపుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఢిల్లీ,గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విషయంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా,60 వేలకు పైగా మృతుల సంఖ్య నమోదు అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube