ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపటి ఈడీ విచారణను దూరంగా ఉండనున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 18న కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు సమన్లు అందించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొంది.అయితే ఆరోగ్య కారణాలతో రేపటి ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది.ఈనెల 30వ తేదీ వరకు కేజ్రీవాల్ విపాసనలో ఉండనున్నారు.ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు ఆయన దూరంగా ఉండనున్నారని సమాచారం.అయితే విపాసన అనేది యోగ- ధ్యాన ప్రక్రియన్న సంగతి తెలిసిందే.







