ఢిల్లీకి చేరిన ఆక్సిజన్.. ప్రధానికి లేఖ రాసిన సిఎం కేజ్రీవాల్..!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రాణవాయువు కరువైంది.కరోనా రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ లేకపోవడంతో ఈమధ్యకాలంలోనే ఢిల్లీ హాస్పిటల్స్ లో అనేక మరణాలు సంభవించాయి.

 Delhi Cm Aravind Kejriwal Thanks Letter To Pm Narendra Modi-TeluguStop.com

ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ లో సీనియర్ డాక్టర్ తో సహా 12 మంది కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయారు.జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో కూడా ఆక్సిజన్ కొరత వల్లే 20 మంది మృతిచెందారు.

సర్ గంగారం హాస్పిటల్ లో కూడా పాతికమంది దాకా ప్రాణాలు విడిచారని సమాచారం.ఢిల్లీలో కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ లేక ప్రాణాలతో పోరాడుతున్నారు.

 Delhi Cm Aravind Kejriwal Thanks Letter To Pm Narendra Modi-ఢిల్లీకి చేరిన ఆక్సిజన్.. ప్రధానికి లేఖ రాసిన సిఎం కేజ్రీవాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడిగిన విషయం తెలిసిందే.ఫైనల్ గా ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిచిందని తెలుస్తుంది.ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ సరఫరా అందించడంతో సిఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం ఢిల్లీ కి ఆక్సిజన్ అందడంతో ప్రధానమంత్రికి లేఖ రాశారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్.

ఢిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని.రోజువారీ ప్రాతిపదికన ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించాలని కోరుతూ తొలిసారి ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందని లేఖలో రాశారు కేజ్రీవాల్.

ప్రతిరోజూ ఇదేవిధంగా ఇంత మొత్తం ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు.ఢిల్లీ ప్రజల తరపున ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్.

#Narendra Modi #Thanks Letter #Delhi #Oxygen #Corona Time

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు