వింత రూల్‌ : కారు, ట్రక్‌ డ్రైవర్లు టూల్‌ బాక్స్‌లో కండోమ్‌ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే?

ఈమద్య కాలంలో దేశంలో ట్రాఫిక్‌ రూల్స్‌, వాహనదారుల రూల్స్‌ ఏ స్థాయిలో మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చలానాలా రూపంలో లక్షలు గుంజేస్తున్నారు.

 Delhi Cars And Truck Drivers Keepingcondomsin First Aid Boxs-TeluguStop.com

హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే ఏకంగా వెయ్యి రూపాయలను వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం వాహన చట్టంలో కొత్త కొత్త నియమ నిబంధనలు తీసుకు వస్తున్నారు.పెద్ద ఎత్తున చలానాలు వసూళ్లు చేసయడంతో పాటు వాహనాలు ఎక్కువగా ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం, ఒక వేళ ప్రమాదం జరిగితే అందులో ఉన్న వారికి వెంటనే చికిత్స అందించేలా ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ను రెడీగా పెట్టించడం వంటివి చేస్తున్నారు.

Telugu Delhicars, Rolevehicle-

  ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా ఒక వార్త వైరల్‌ అవుతుంది.ఢిల్లీ పోలీసులు కొత్త వాహన చట్టం అంటూ ప్రతి కారు లేదా ట్రక్‌లో ఉండాల్సిన టూల్‌ బాక్స్‌ మరియు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ను క్షుణ్ణంగా పరీక్షిస్తుంది.అందులో ఉండాల్సినవన్నీ ఉన్నాయా అంటూ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.ఒక వేళ ఆ బాక్స్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పెద్ద ఫైన్‌ వేస్తున్నారట.

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో కండోమ్‌ ఎందుకు, అసలు దానితో పనేంటి బాబోయ్‌ అంటూ డ్రైవర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు.

Telugu Delhicars, Rolevehicle-

  ఇంతకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో కండోమ్‌ ఎందుకంటే యాక్సిడెంట్‌ అయినప్పుడు కాళు లేదా చేయి లేదా మరెక్కడైనా గాయాలు అయ్యి రక్తం పోతున్నట్లయితే వెంటనే ఆ కండోమ్‌ను తీసి ఆ ప్రదేశంలో కట్టడం వల్ల రక్తం పోవడం ఆగిపోతుంది.అందుకే వెంటనే రక్తం వచ్చే చోట కండోమ్‌ తీసి కట్టి హాస్పిటల్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.కండోమ్‌ సాగతీసి గాయం అయిన చోట కట్టడం వల్ల రక్త ప్రసరణ కూడా తగ్గకుండా ఉంటుంది.

రక్తం నష్టం ఎక్కువగా ఉండదు.రక్తం పోకుండా ఉండటం వల్ల ప్రాణాల నుండి బయట పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ కొత్త రూల్‌ గురించి తెలియడంతో ఢిల్లీ డ్రైవర్లు అంతా కూడా కండోమ్స్‌ కోసం మెడికల్‌ షాప్‌కు పరుగెడుతున్నారు.ఈ విషయమై ఒక ఢిల్లీ ఉన్నతాధికారిని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ ఇలాంటి నిబంధన ఏమీ లేదని, అయితే మెడికల్‌ కిట్‌లో కండోమ్‌ ఉంటే మంచిదని కొందరు సూచిస్తున్నారు.

అది కాస్త పోలీసులు తీసుకు వచ్చిన నిబంధనగా ప్రచారం జరుగుతోంది.దీనిపై డ్రైవర్లు ఎలాంటి ఆందోళన పెట్టుకోనక్కర్లేదు అంటున్నారు.పోలీసులు ఏం చేసినా, ఏ నిబంధన పెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసమే అంటూ ఆ పోలీసు ఉన్నతాధికారి చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube