ఐపీఎల్‌లో ఢిల్లీ అత్యంత చెత్త రికార్డు

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ధిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది.ఐపీఎల్ చరిత్రలో బ్యాటింగ్‌కు దిగిన ఆరంభంలోనే త్వరగా మూడు వికెట్లు కోల్పోయిన జట్టుగా అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌కి చేరుకుందామని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ముంబై ఇండియన్స్ బౌలర్లు షాకిచ్చారు.

 Delhi Capitals Worst Record-TeluguStop.com

1.2 ఓవర్లలో 0 పరుగులతో మూడు వికెట్లను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది.ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలా ఎప్పుడు జరగేలేదు.

ఆరంభంలోనే పృథ్వీషా, అజింక్యా రహనే, శిఖర్ ధావన్ డకౌట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయావకాశాలు పోయాయి.ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కూడా నిలకడగా ఆడలేకపోయారు.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా.బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లోకి వెళ్లింది.తొలి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్ బౌలర్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా… ఆ తర్వాత ఓవర్‌లో వెంటనే బూమ్రా మరో వికెట్ పడగొట్టాడు.

ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి ధిల్లీ బ్యాట్స్‌మెన్స్ వరుసగా పెవిలియన్‌కు చేరారు.మొత్తానికి ఈ మ్యాచ్ గెలిచి పైనల్‌కి చేరుకుందామని ఆశించిన ఢిల్లీకి ముంబై షాకిచ్చిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube