సమఉజ్జీలలో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ సూపర్’ విజయం…!  

delihi capitals, kings XI Punjjab, ipl 2020, super over, Delhi win - Telugu Delhi Win, Delihi Capitals, Ipl 2020, Kings Xi Punjjab, Super Over

ఐపీఎల్ 2020 సీజన్మొదలైన రెండో రోజే మంచి కిక్ ఇచ్చే గేమ్ జరిగింది.ఈ సీజన్ లో రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది.

TeluguStop.com - Delhi Capitals Won Match On Kings Xi Punjab In Super Over

ఇక ఈ మ్యాచ్ లో మొదటగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇక 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది.

ఈ స్కోర్ చేయడానికి చివర్లో వచ్చిన స్టాయిన్స్ 21 బంతుల్లో 53 పరుగులు ఆకాశమే హద్దుగా అన్నట్లు చెలరేగి ఆడాడు.ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ చెప్పుకోదగ్గ పరుగులు చేసిన వారిలో ఉన్నారు.

TeluguStop.com - సమఉజ్జీలలో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్’ విజయం…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే.మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకోగా, కాట్రెల్ రెండు వికెట్లు, రవి బొంషై ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే వికెట్లను చేజార్చుకుంటూ వచ్చింది.అయితే కింగ్స్ పంజాబ్ కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చిన యమాంక్ అగర్వాల్ 60 బంతుల్లో 89 పరుగులు చేసి పంజాబ్ బ్యాట్స్మెన్స్ లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా నిలిచాడు.

ఢిల్లీ బౌలర్ల విషయానికి వస్తే… రవిచంద్రన్ అశ్విన్, రబడా, స్టాయిన్స్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి.వీరితో పాటు అక్షర్ పటేల్, మోహిత్ శర్మ లకు చెరో వికెట్ లభించాయి.

అయితే 20 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ జట్టు కూడా 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీనితో మ్యాచ్ సూపర్ ఓవర్ కి దారి తీసింది.

సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కేవలం మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో… స్వల్ప లక్ష్యంతో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 3 బంతుల్లోనే తన లక్ష్యాన్ని పూర్తి చేసి ‘సూపర్’ మ్యాచ్ విజయాన్ని అందుకుంది.

#Delhi Win #Delihi Capitals #Ipl 2020 #Super Over

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Delhi Capitals Won Match On Kings Xi Punjab In Super Over Related Telugu News,Photos/Pics,Images..