ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో సన్ రైజర్స్ మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉందో చూడండి...

సన్ రైజర్స్ గత మ్యాచ్ లో బెంగళూర్ పైన అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యుత్తమమైన ప్రదర్శన చేసింది.డేవిడ్ వార్నర్ , బైర్ స్టో లు ఫామ్ కొనసాగించడం సన్ రైజర్స్ కి అనుకులాంశం.ఢిల్లీ తమ బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్న చేదనలో తడబడుతూ ఓటమి అంచులకి వస్తుంది.

 Delhi Capitals Vs Sunrisers Hyderabad Who Will Win-TeluguStop.com

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ రికార్డులు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్లు 12 మ్యాచ్ లు ఆడగా ఢిల్లీ 4 మ్యాచ్ లలో గెలుపొందగా సన్ రైజర్స్ 8 మ్యాచ్ లలో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది.

ఢిల్లీ లో ని ఫిరోజ్ షా కోట్లలో మ్యాచ్ జరుగుతుండటం , ఇక్కడి పిచ్ నెమ్మదిగా ఉండబోతుంది.ఈ పిచ్ లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.సాధారణంగా ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.ఢిల్లీతో సన్ రైజర్స్ జట్టు స్పిన్ బౌలింగ్ పటిష్టంగా ఉంది.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత రెండు మ్యాచ్ లలో విజయం వరకు వచ్చి ఒక మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో గెలవగా , మరో మ్యాచ్ ఓటమి పాలైంది.బౌలింగ్ లో ఢిల్లీ బాగానే కనిపిస్తున్న మ్యాచ్ ని ముగించగలిగే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం ఢిల్లీ కి ప్రధాన సమస్య.సన్ రైజర్స్ జట్టు ని 150 నుండి 160 పరుగులకి కట్టడి చేస్తే ఢిల్లీ జట్టు కి గెలిచే అవకాశాలు ఉంటాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – శిఖర్ ధావన్ , ప్రిథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , కోలిన్ ఇంగ్రామ్ , రిషబ్ పంత్ , హనుమ విహారి , అక్షర్ పటేల్ , రాహుల్ తేవాటియా , రబడ , ఇషాంత్ శర్మ , ట్రెంట్ బౌల్ట్

4)సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లో నబి , రషీద్ ఖాన్ , భువి అందరూ ఫామ్ లోకి వచ్చారు ఇకపోతే బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్ , విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ , బైర్ స్టో లు ఫామ్ లో ఉండడం సన్ రైజర్స్ కి బలంగా కనిపిస్తున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI ) – డేవిడ్ వార్నర్ , బైర్ స్టో , విజయ్ శంకర్ , విల్లియమ్సన్ / నబీ, యూసఫ్ పఠాన్ , మనీష్ పాండే , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సందీప్ శర్మ , సిద్దార్థ్ కౌల్ , నదీమ్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube