ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో పంజాబ్ ఢీ , ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయి చూడండి....

పంజాబ్ , ఢిల్లీ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్ లు గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి.ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్ కత్తా పైన సూపర్ ఓవర్ లో గెలిచి ఆత్మ విశ్వాసాన్ని కూడకట్టుకుంది.

 Delhi Capitals Vs Kings Eleven Punjab Kings Who Will Win-TeluguStop.com

ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాటు యువ ఆటగాడు ప్రిథ్వీ షా కూడా ఫామ్ అందుకోవడం ఆ జట్టు బ్యాటింగ్ ని పటిష్టంగా చేసింది.ఇకపోతే పంజాబ్ జట్టు ముంబై తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో ప్రతిభ చూపింది , ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ కె.ఎల్ రాహుల్ ఫామ్ లో కి వచ్చాడు.ఇరు జట్ల మధ్య పోరు పోటాపోటీగా ఉండనుంది.

1) ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల రికార్డ్ ఎలా ఉంది

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్ లు జరగగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 13 మ్యాచ్ లు గెలవగా ఢిల్లీ 9 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2) పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ పంజాబ్ సొంత గ్రౌండ్ అయిన మొహాలీ లో జరగనుంది.ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది.టాస్ గెలిచిన జట్టు లక్ష్య చేదన చేసే అవకాశం ఉంది.

ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటుగా 175 పరుగులు చేసింది.

3) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లో కీలకమైన మిడిల్ ఓవర్లలో ముంబై బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు.ముఖ్యంగా మురుగన్ అశ్విన్ కీలకమైన వికెట్ లు తీసుకున్నాడు.బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు రాహుల్ , గేల్ లతో పాటు మాయంక్ అగర్వాల్ ఫామ్ లోకి వచ్చారు.

ఢిల్లీ బ్యాటింగ్ ని పంజాబ్ బౌలర్లు ఏ విధంగా ఎదురుకుంటారో చూడాల్సిందే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – కె.ఎల్ .రాహుల్ , క్రిస్ గేల్ , మయంక్ అగర్వాల్ , కరుణ్ నాయర్ , మాన్ దీప్ సింగ్ , శ్యాం కుర్రాన్ , అశ్విన్ , టై , షమీ , అంకిత్ రాజ్పుత్ , ముజీబ్ రెహ్మాన్

4) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది:


ఢిల్లీ జట్టు తన గత మ్యాచ్ లో బలమైన కోల్ కత్తా బ్యాటింగ్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు .దినేష్ కార్తీక్ , రస్సెల్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ లను త్వరగా పెవిలియన్ కి పంపించారు.బ్యాటింగ్ లో కూడా అయ్యర్ , పంత్ , ప్రిథ్వీ షా, ధావన్ , ఇంగ్రామ్ లతో బలంగా కనిపిస్తుంది.

బౌలింగ్ లో రబడ , మిశ్రా , ట్రెంట్ బౌల్ట్ లతో మెరుగ్గా కనిపిస్తుంది.పంజాబ్ ని150 నుండి 160కి కట్టడి చేస్తే ఢిల్లీ విజయం సులువవుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI )

– శిఖర్ ధావన్ , ప్రిథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , కోలిన్ ఇంగ్రామ్ , రిషబ్ పంత్ , కిమ్ పాల్ , అక్షర్ పటేల్ , రాహుల్ తేవాటియా , రబడ , ఇషాంత్ శర్మ , ట్రెంట్ బౌల్ట్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube