ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో చెన్నై ఢీ , ఏ జట్టుకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయో చూడండి...

ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఢిల్లీ క్యాపిటప్స్ కి మధ్య జరగనుంది.ఇరు జట్లు తమ మొదటి ఐపీఎల్ మ్యాచ్ లు గెలిచి జోరు మీద ఉన్నాయి.

 Delhi Capitals Vs Chennai Super Kings Who Will Win-TeluguStop.com

ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో విజృభించగా , చెన్నై తన మొదటి మ్యాచ్ లో బౌలింగ్ తో బెంగళూర్ ని 70 పరుగులకే కట్టడి చేసింది.ఇకపోతే ఏ మ్యాచ్ ఢిల్లీ లో జరుగుతుండటం ఢిల్లీ కి కలిసొచ్చే అంశం.ఇరు జట్లు బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది అనడం లో సందేహం లేదు.

పిచ్ ఎలా ఉండబోతుంది

ఢిల్లీ లో ని ఫిరోజ్ షా కోట్లలో మ్యాచ్ జరుగుతుండటం , ఇక్కడి పిచ్ నెమ్మదిగా ఉండబోతుంది.ఈ పిచ్ లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.సాధారణంగా ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.ఢిల్లీతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పిన్ బౌలింగ్ పటిష్టంగా ఉంది.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఐపీఎల్ లో అన్ని సీజన్ల కలిపి ఇరుజట్లు 18 మ్యాచ్ లు ఆడగా చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్ లు గెలవగా , ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ లు గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ తన మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగవచ్చు , తొలి మ్యాచ్ లో యువ ఓపెనర్ ప్రిథ్వీ షా విఫలం అవ్వడం మినహాయించి బ్యాటింగ్ లో మిగితా అందరూ రాణించారు.బౌలింగ్ లో కూడా రబడ , ఇషాంత్ శర్మలు రాణించారు.ఢిల్లీ తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – శిఖర్ ధావన్ , ప్రిథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , కోలిన్ ఇంగ్రామ్ , రిషబ్ పంత్ , కిమ్ పాల్ , అక్షర్ పటేల్ , రాహుల్ తేవాటియా , రబడ , ఇషాంత్ శర్మ , ట్రెంట్ బౌల్ట్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడు సమిష్టి జట్టు గా ఆడి విజయాలు సాధిస్తుంది.మొదటి మ్యాచ్ లో లక్ష్యం చిన్నది అవడం ఆ జట్టు బ్యాటింగ్ కి పెద్దగా పరీక్ష పెట్టలేదు.బౌలింగ్ మాత్రం కట్టుదిట్టంగా ఉంది.

ఆ జట్టు బౌలింగ్ లో రాణిస్తే చెన్నై ఖాతాలో మరో విజయం ఖాయం.గత మ్యాచ్ లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో ఆడిన చెన్నై ఈ మ్యాచ్ లో చిన్న మార్పులతో బరిలోకి దిగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) – షేన్ వాట్సన్ , అంబటి రాయుడు , సురేష్ రైనా , ధోని , జడేజా , బ్రావో , డూప్లెసిస్ , తహిర్ , హర్భజన్ , దీపక్ చహార్ , శార్దూల్ ఠాకూర్

ఢిల్లీ సొంత గడ్డ పై ఆడుతుండం ,చెన్నై జట్టు కూడా పటిష్టంగా ఉండడం ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది.విజయావకాశాలు ఎక్కువ చెన్నై జట్టుకే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube