ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో చెన్నై మ్యాచ్... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి..

చెన్నై , ఢిల్లీ జట్లు చెరో 8 మ్యాచ్ లు గెలిచి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి చేరాయి .ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది.

 Delhi Capitals Vs Chennai Super Kings Match Prediction-TeluguStop.com

ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని బరిలోకి దిగుతున్నాయి ఇరు జట్లు .చెన్నై లో జరగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఫేవరెట్ గా కనిపిస్తుంది , ఆ జట్టు గత మ్యాచ్ లో ముంబై పైన లక్ష్య ఛేదన లో తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది.ఆ జట్టు బ్యాటింగ్ లో నిలకడ లోపించడం జట్టు యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతుంది.చివరి మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న ధోని ఈ మ్యాచ్ లో అదే అవకాశం ఉంది .ఇకపోతే ఢిల్లీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది , కురాళ్ళ తో కుడి ఉన్న ఢిల్లీ జట్టు ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన ని కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది .ఢిల్లీ జట్టు యువ ఓపెనర్ ప్రిథ్వి షా భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా మ్యాచ్ లు అవుతుంది , అతడు ఫామ్ లోకి వస్తే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డు లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరగగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్ లలో నెగ్గగా , ఢిల్లీ జట్టు 6 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ చెన్నై లో జరగనుంది , ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే ఇతర పిచ్ ల తో పోలిస్తే ఇక్కడి పిచ్ చాల నెమ్మదిగా ఉండనుంది .టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోవడానికి ముఖ్య కారణం ఆ జట్టు సమిష్టిగా రాణించడమే.

చెన్నై తో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ఈ సీజన్ పాయింట్ ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుంది .ఇకపోతే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉంది .రబడ మినహా మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు .చెన్నై జట్టు బ్యాట్స్ మెన్ లను కట్టడి చేస్తే ఆ జట్టు కి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) –
శిఖర్ ధావన్ , ప్రిథ్వి షా , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కాలిన్ ఇంగ్రామ్ , షెర్ఫానే రూథర్ఫోర్డ్ , అక్షర్ పటేల్ , అమిత్ మిశ్రా , కార్గిసో రాబడ ,సందీప్ లామిచ్చనే , ఇషాంత్ శర్మ

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై తో ఆడిన మ్యాచ్ లో లక్ష్య ఛేదన లో కుదేలయినా చెన్నై జట్టు , ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న తపనతో బరిలోకి దిగనుంది.ఇక గాయం తో బాధపడుతున్న ధోని ఈ మ్యాచ్ లో ఆడటం అనుమానమే .ఎం ఎస్ ధోని లేని చెన్నై జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తుంది .ఈ సీజన్ లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడని సురేష్ రైనా ఈ మ్యాచ్ లో రాణిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.ఇక బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్న , సీజన్ ఆరంభం నుండి చెన్నై జట్టు మునపటిల బలంగా కనిపించడం లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) –

షేన్ వాట్సన్ , ఫఫ్ డుప్లెసిస్ , సురేష్ రైనా , అంబటి రాయుడు , కేదార్ జాదవ్ , బ్రావో , రవీంద్ర జడేజా , దీపక్ చాహర్ ,హర్భజన్ సింగ్ , శార్దూల్ ఠాకూర్ , ఇమ్రాన్ తాహిర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube