అక్షర్ పటేల్ అరుదైన రికార్డు..!

ఐపిఎల్ ఇంకో కొన్నిరోజులే ఉండనుంది.తుది దశకు చేరింది.

 Delhi Capitals Spinner Axar Patel Sets New Record With Two Man Of The Match Awar-TeluguStop.com

దీంతో ఐపిఎల్ ట్రోఫీని ఎవరు సాధిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చాలా జట్లు ఇంటి ముఖం పట్టాయి.

కప్ కోసం హోరాహోరీ మ్యాచ్ లు జరుగుతున్నాయి.ఓ వైపు గ్రౌండ్ లో సిక్సర్ల మోత మోగుతోంది.

ఫోర్లతో క్రికెటర్లు ఫామ్ లో నిలుస్తున్నారు.తమ అద్బుత ప్రదర్శనతో మరికొందరు క్రికెటర్లు రికార్డులు సాధిస్తున్నారు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కూడా ఓ రికార్డును నెలకొల్పాడు.ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్ పటేల్ ఈ అద్బుత రికార్డును నెలకొల్పాడు.

ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ 2021 సెకెండ్‌ ఫేజ్‌ మ్యాచుల్లో ఢిల్లీ రెండు వరుస విజయాలను నమోదు చేసుకుంది.విజయాల పరంపర కొనసాగిస్తుండటంతో ఐపిఎల్ పట్టికలో ఢిల్లీ మొదటి స్థానానికి చేరింది.

ఇలా ఆ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించడంలో అక్షర్ పటేల్ పాత్ర ఎక్కువగా ఉందనే చెప్పాలి.ఈ టీమ్ సాధించిన చివరి రెండు విజయాల్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్బత ఆటతీరున కనబరిచాడు.

ఈ స్పిన్నర్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులను గడగడలాడించాడు.గత రెండు మ్యాచులలో అద్బుత ప్రదర్శన చూపడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలవడం విశేషం.

Telugu Akshay Patel, Axar Pater, Ipl, Ups, Awards-Latest News - Telugu

ఇలా ఓ స్పిన్నర్ టీమ్ లో కీలక పాత్ర పోషించి విజయం తేవడం చాలా అరుదుగా జరిగే పరిణామం.ఐపీఎల్‌ లో ఒక స్పిన్నర్ ఈ విధంగా వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలవడం ఈ ఢిల్లీ స్పిన్నర్ కే దక్కింది.ఇలాంటి రికార్డు 2011 తర్వాత ఇదే తొలిసారిగా నమోదైంది.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ రెండు కీలకమైన వికెట్లను తీశాడు.దీనివల్ల జట్టు విజయతీరాలను అందుకుంది.

మొత్తానికి ఈ ఢిల్లీ స్పిన్నర్ సంచలన రికార్డును నెలకొల్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube