మొన్న కోహ్లీకి, నేడు శ్రేయస్ అయ్యర్ కు భారీ జరిమానా... అసలు విషయమేమిటంటే ...?!

ప్రస్తుతం యూఏఈ దేశం వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ 13 సీజన్ లో భాగంగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగగా చివరకు హైదరాబాద్ టీం 16 పరుగులతో విజయం సాధించింది.అయితే ఈ మ్యాచులో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు షాక్ తగిలింది.

 Delhi Capitals Captain Shreyas Iyer Fined 12lakh Rupees, Delhi Capitals Captain-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

తాజాగా జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీం బౌలింగ్ చేయడానికి నిర్దేశ సమయం కన్నా ఎక్కువ సేపు సమయం తీసుకోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు అతనిపై జరిమాన విధించారు.ఇదివరకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లి పై కూడా ఇలాగే స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల భారీ జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం.

ఇకపోతే గత మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది.అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో సన్ రైజర్స్ జట్టు ఆటగాళ్లు క్రీజ్ లో నిలదొక్కుకుని పరుగులు రాబడుతున్నారు.

ఈ సమయంలో బ్యాట్స్మెన్స్ ను తిప్పలు పెట్టే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ బౌలర్స్ విషయంలో అనేక మార్పులు చేస్తూ వచ్చాడు.

ఈ చర్చల నడుమ మ్యాచ్ కాస్త నిదానంగా గడిచింది.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లు నిర్ధేశించిన సమయానికి బౌలింగ్ చేయకపోవడంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు వేటు పడింది.లీగల్ నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేట్ అర్ ఉల్లంఘనకు పాల్పడటం కారణంగా శ్రేయస్సు కి 12 లక్షల భారీ జరిమానా విధించక తప్పలేదు.

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టిక లో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో ఉంది.ఇక నేడు కోల్కత్తా నైట్ రైడర్స్.

రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube