ఒక్క వికెట్ తీయడంతో 2 రికార్డ్స్ ని సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్..!

ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ దేశంలో హోరా హోరీ గా కొనసాగుతోంది.ముఖ్యంగా పాయింట్ల పట్టిక లో మొదటి స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీ గా పోటీ పడుతున్నాయి.

 Ipl, Ipl 2020. Delhi Capitals, Rabada, New Record, Wicket-TeluguStop.com

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి.ఇకపోతే ఈ మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ బౌలర్ రబాడ చరిత్ర సృష్టించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో బ్యాట్స్మెన్ డుప్లెసిస్ వికెట్ తీసిన తర్వాత ఒకేసారి రెండు రికార్డులను నెలకొల్పాడు.

షార్జా నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో డుప్లెసిస్ వికెట్ తీసిన తర్వాత రబాడ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్ర లో అతి తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్స్ తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.ఇది వరకు వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది.

సునీల్ నరైన్ 32 మ్యాచ్ ల్లో 50 వికెట్లు తీయగా రబాడ మాత్రం కేవలం 27 మ్యాచ్ ల్లో ఈ మార్క్ ను అందుకున్నాడు.ఇక మరో రికార్డు విషయానికొస్తే.

అతి తక్కువ బంతుల్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేగంగా వికెట్లు నెలకొల్పిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు.కేవలం 616 బంతుల్లో అతడు 50 వికెట్లు తీసుకున్నాడు.

ఈ లిస్టులో ఇదివరకు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 749 బంతుల్లో 50 వికెట్లు పడగొట్టి ముందు స్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు.అలాగే వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ 760 బంతుల్లో 50 వికెట్లను తీసుకున్నాడు.

ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో రబాడ తన నాలుగు ఓవర్ల లో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.ఇకపోతే 2017లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రబడా ఆ సీజన్ లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగా 2018 సీజన్ లో మాత్రం ఆడకుండా దూరంగా ఉన్నాడు.

ఆ తర్వాత 2019 సీజన్ లో ఏకంగా 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్ లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు.ఇక ప్రస్తుత సీజన్ లో 19 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube