ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో ముంబై మ్యాచ్.. ఏ జట్టు కి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయో చూడండి..  

Delhi Capital Versus Mumbai Indians Who Will Win -

ముంబై , ఢిల్లీ జట్లు తమ గత మ్యాచ్ లలో గెలిచే మంచి ఉత్సాహం తో ఈ రోజు మ్యాచ్ లో బరిలోకి దిగానున్నాయి.ఈ సీజన్ లో రెండు జట్ల తలపండిన చివరి మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది.

Delhi Capital Versus Mumbai Indians Who Will Win

ఆ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి ఢిల్లీ కి భారీ స్కోర్ అందించాడు.ఇకపోతే ముంబై జట్టు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది.

ముంబై జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది.ఆ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఎవరో ఒక ఆటగాడు బ్యాట్ ను ఝులిపిస్తున్నాడు.బౌలింగ్ లో కూడా బుమ్రా , మలింగ లతో బలంగా కనిపిస్తుంది.

ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో ముంబై మ్యాచ్.. ఏ జట్టు కి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయో చూడండి..-Sports News క్రీడలు-Telugu Tollywood Photo Image

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్ లు జరగగా ఢిల్లీ 12 మ్యాచ్ లలో గెలుపొందింది , ముంబై 11 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ముంబై ఢిల్లీ జట్లు ఈ రోజు మ్యాచ్ ని ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానం లో ఆడనున్నాయి.ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు పైన సమిష్టిగా రాణించి గెలుపొందింది.ఆ మ్యాచ్ లో ఓపెనర్లు విఫలమయినప్పటికి ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , కాలిన్ మన్రో కలిసి ఢిల్లీ కి మంచి స్కోర్ ని అందించారు.ఇక బౌలింగ్ లో రబడ , కిమ్ పాల్ , మోరిస్ , ఇషాంత్ లు రాణించారు.

ఢిల్లీ బౌలర్లు ముంబై బ్యాట్స్ మెన్ లను కట్టడి చేస్తే విజయావకాశాలు ఆ జట్టు కి ఎక్కువ ఉండనున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – ప్రిథ్వీ షా , శిఖర్ ధావన్ , కాలిన్ మన్రో , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , క్రిస్ మోరీస్ , కీమో పాల్ , అక్షర్ పటేల్ , రబడ , ఇషాంత్ శర్మ , అమిత్ మిశ్రా

4)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ గెలిచిన ఎక్కువ మ్యాచ్ లలో హార్దిక్ పాండ్య చివరి ఓవర్ లలో కొన్ని కీలక ఇన్నింగ్స్ లు ఆడి ముంబై ఇండియన్స్ కి విజయాలు అందించాడు.ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో భారీ ఇన్నింగ్స్ ఆడలేదు.అతను ఆరంభం లో ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడితే ముంబై 180 పరుగుల పై చిలుక స్కోర్ చేయగలదు.

ఇక ముంబై జట్టు బౌలింగ్ విషయానికొస్తే ఆ జట్టు డెత్ బౌలింగ్ బాగున్నప్పటికి ఢిల్లీ తో ఆడిన గత మ్యాచ్ లో బుమ్రా , మలింగ లాంటి ఆటగాళ్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.ముఖ్యంగా రిషబ్ పంత్ ధాటికి ముంబై చివరి 6 ఓవర్ లలో 80 పరుగులు సమర్పించుకుంది.

ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ని ముంబై బౌలర్లు కట్టడి చేస్తే ముంబై విజయం సాధించే అవకాశం ఉంది.ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందడుగు వేయాలని ముంబై ఆలోచిస్తుంది.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – రోహిత్ శర్మ , డికాక్ , సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్య , పొలార్డ్ , కృనల్ పాండ్య ,రాహుల్ చహార్ , మలింగ్ , బుమ్రా , బెహరెండోర్ఫ్

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు