తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద పీట వేస్తున్న ఢిల్లీ బీజేపీ.. ప‌క్కాప్లాన్ తోనే ముందుకు

బీజేపీకి దేశంలో ఇప్పుడు మంచి మెజార్టీ ఉంది.కానీ ఏ పార్టీకి అయినా కొంత వ‌ర‌కే అవ‌కాశం ఇస్తార‌నే విష‌యం కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు బాగా తెలుసు.

 Delhi Bjp Is Laying A Big Platform For Telugu States .. Go Ahead With The Plan,-TeluguStop.com

అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన రాష్ట్రాల‌ను కాకుండా కొత్త రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెడుతున్నారు.ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీపై ఇప్పుడు ఒకింత వ్య‌తిరేక‌త మొద‌ల‌వుతోంది.

దీంతో కేంద్ర బీజేపీ పెద్ద‌లు అల‌ర్ట్ అయిపోయారు.రాబోయే ఎన్నిక‌ల్లో ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ఆధారంగా చేసుకుని గెల‌వాల‌నే ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇందుకోసం మ‌రీ ముఖ్యంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎక్కువ ప్రాధాన్యం క‌ల్పిస్తున్నారు.

అటు ప్ర‌భుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తెలుగు వారికి పెద్ద పీట వేస్తున్నారు కేంద్ర పెద్ద‌లు.

ఇందులో భాగంగానే ఇప్పుడు మ‌రో అడుగు వేశారు.రీసెంట్ గా బీజేపి పార్టీ జాతీయ కార్యవర్గాన్ని కొత్త‌గా నియ‌మించారు.

ఇందులో మ‌న రెండు రాష్ట్రాల‌కు చెందిన వారికే కీలక పదవులు దక్క‌డం విశేషం.బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వెల్ల‌డించారు.

ఇందులో ఏపీ నుంచి కన్నా లక్ష్మినారాయణకు అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటుగా జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావుకు ప‌దువులు కేటాయించి వారికి పెద్ద పీట వేశారు.

Telugu Bjp, Delhi Bjp, Dk Aruna, Jp Nadda, Kishan Reddy, Telugu, Vijaya Shanthi-

దాంతో పాటు బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లలో డీకే అరుణ, ఏపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్ లు ఈ క‌మిటీలో ఉన్నారు.అలాగే ప్రత్యేక ఆహ్వానితులు క‌మిటీల కూడా తెలంగాణగే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.ఇందులో విజయశాంతితో పాటుగా ఈటల రాజేందర్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇందులో ఇద్ద‌రూ తెలంగాణ‌కు చెందిన వారే.ఇందులో ఏపీ కంటే కూడా తెలంగాణ‌కే ఎక్కువ ప‌ద‌వులు ద‌క్క‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే ప్ర‌ణాళిక‌లో భాగంగానే ప‌ద‌వులు కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలో బ‌ల‌ప‌డేందుకు వీలుగా వారికి కూడా ప‌దవులు కేటాయించింది కేంద్ర బీజేపీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube