ఏడు సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ బ్యూటీ..!

ప్రస్తుతం రాశి ఖన్నా చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Delhi Beauty Rashi Khanna Has Lined Up Seven Movies-TeluguStop.com

అయితే ఎన్ని సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది.అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది రాశి ఖన్నా.

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది.ఈ బ్యూటీ ఏ లుక్ లో అయినా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Delhi Beauty Rashi Khanna Has Lined Up Seven Movies-ఏడు సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం సినిమాలను లైన్లో పెట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ.రాశి ఖన్నా చివరిగా విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక్క సినిమా కూడా చేయలేదు.

Telugu Bollywood, Delhi Beauty Rashi Khanna Has Lined Up Seven Movies, Kollywood, Rashi Khanna, Seven Movies, Tollywood-Movie

దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు రావడం లేదు అని అనుకునే లోపే లాక్ డౌన్ లో వరస సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.ఈ బ్యూటీ చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నట్టు సమాచారం.ప్రస్తుతం తెలుగులో మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ కు జంటగా పక్కా కమర్షియల్ సినిమా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య తో థాంక్యూ సినిమాలో నటిస్తుంది.

వీటితో పాటు మేధావి, తుగ్లక్ దర్బార్, సర్దార్, సైతాన్ కా బచ్చా, అరణ్మ నై 3 వంటి సినిమాలను లైన్లో పెట్టింది.అసలు సినిమాలు లేక కెరీర్ ముగిసి పోతుందేమో అనుకుంటున్నా సమయంలో వరస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మరొక సారి వార్తల్లో నిలిచింది.

చూస్తుంటే ఈ అమ్మడు జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.ఈ సినిమాల్లో మూడు నాలుగు హిట్ అయినా మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.

#DelhiBeauty #Seven Movies #Rashi Khanna #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు