స్పూర్తి : చిత్తు కాగితంతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. స్కాట్లాండ్‌లో భారతీయ మహిళ విజయాలు

సృష్టిలో పనికిరానిందంటూ ఏది వుండదు.చాలా మందికి ఈ విషయం తెలియక కొన్నింటిని వేస్ట్ అంటూ వుంటారు.

 Delhi Based Poonam Gupta Set Up A Business Empire In Scotland Details, Delhi ,po-TeluguStop.com

అలాంటి వాటిలో చిత్తు కాగితాలు కూడా ఒకటి.వేస్ట్ పేపర్స్ కింద పరిగణించి వీటితో కొందరు కోట్లు సంపాదిస్తున్నారు.

ఈ కోవకే చెందుతారు స్కాట్‌లాండ్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ పూనం గుప్తా.పేపర్ వ్యర్థాలతో కోట్ల విలువైన కంపెనీని స్థాపించి ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

ఢిల్లీకి చెందిన పూనమ్ గుప్తా.లేడి శ్రీరామ్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో పట్టభద్రురాలైంది.

అనంతరం ఎంబీఏ పట్టా అందుకున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో పాల్గోనేందుకు పూనమ్ వచ్చారు.

2002లో స్కాట్లాండ్‌లో వైద్యరంగంలో మంచి గుర్తింపు వున్న పునీత్‌తో పూనమ్ వివాహం జరిగింది.తొలుత అక్కడ ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలనేది పూనమ్ తొలి కర్తవ్యం.

కానీ అది కార్యరూపం దాల్చలేదు.అనంతరం కొత్తగా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో రీసెర్చ్ ప్రారంభించింది.

ఈ సమయంలో యూరప్, అమెరికాలలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ మంచి నాణ్యత గల స్క్రాప్ పేపర్ డంపింగ్ యార్డ్‌ను చేరుతోందని గ్రహించింది.ఎందుకంటే అక్కడ నాణ్యతగల కాగితం ఉత్పత్తి అవుతుందని.

ఆ తరహా కాగితాన్ని ఉత్పత్తి చేయడానికి చిత్తు కాగితాన్ని ఉపయోగించడం ఖరీదైన వ్యూహమని పూనమ్ భావించింది.పేపర్ స్క్రాప్‌లు భారతదేశంలో బాగా ఉపయోగపడతాయని తెలుసుకుంది.

Telugu Empire, Delhi, Poonam Gupta, Poonamgupta, Scotland, Scotlandpoonam, Waste

ఈ క్రమంలో ఓ ఇటాలియన్ కంపెనీని సంప్రదించిన పూనమ్.అక్కడి నుంచి వేస్ట్ పేపర్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించింది.తర్వాత దానిని డంపింగ్ చేయడం స్టార్ట్ చేసింది.అలా ఆమె అందుకున్న తొలి డీల్ రూ.40 లక్షలు, ఆ తర్వాత పనిని పెంచుకుంటూ వచ్చిన పూనమ్ 2004లో స్కాట్లాండ్‌లో పీజీ పేపర్ పేరుతో కంపెనీని రిజిస్టర్ చేసే స్థాయికి చేరుకున్నారు.ఆ తర్వాత ఆమె ఇటలీ , ఫిన్‌లాండ్, యూఎస్‌లకు చెందిన కొన్ని కంపెనీల నుంచి స్క్రాప్ పేపర్‌‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేసింది.

కంపెనీలకు నగదు రూపంలో చెల్లింపులు చేయడంతో వారి అభిమానాన్ని పొందింది.

Telugu Empire, Delhi, Poonam Gupta, Poonamgupta, Scotland, Scotlandpoonam, Waste

అంచెలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చిన పూనమ్.ఇతర రంగాలలోనూ అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె 9 కంపెనీలతో 60కి పైగా దేశాలలో వ్యాపారం చేస్తున్నారు.పూనం కంపెనీ నెట్‌వర్క్ రూ.1000 కోట్ల పై మాటే.ఈ ఆలోచనకు మీకు స్పూర్తి ఏంటని అడిగినప్పుడు.భారతదేశంలోని ప్రజలు పాత విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి వుంటారని, వాటిని ఎప్పటికీ వదిలించుకోరని చెప్పారు.ఇతర దేశాలలో స్క్రాప్ పేపర్ నుంచి మంచి నాణ్యత గల కాగితం పునరుత్పత్తి చేయడం సాధ్యం కాదని, అయితే భారతదేశంలో చిత్తు కాగితంతో తయారు చేయబడిన పేపర్ మంచి నాణ్యతతో వుంటుందని ఆమె అన్నారు.ఈ ఆలోచనలే తనకు ఈ రంగంలోకి దిగి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం కల్పించిందని పూనమ్ పేర్కొన్నారు.

అలాగే ఫ్యాబ్రిక్ స్క్రాప్‌ను మళ్లీ ఉపయోగించేందుకు తాను పరిశోధనలు చేస్తున్నానని ఆమె చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube