దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం.. అక్కడికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి.. !

దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఊహించని సంఘటనలను, దారుణాలను ఈ కరోనా ప్రజలకు పరిచయం చేస్తుంది.

 Delhi And Telangana States Travelling Passengers Fourteen Days Quarantine-TeluguStop.com

ఇప్పటికే ప్రతి వారి జీవితాన్ని శాసిస్తున్న కరోనా ఎప్పుడు ఎవరి నుదుటన మరణ శాసనం రాస్తుందో అర్ధంకాక భయం గుప్పిట్లో జనం బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ కోవిడ్ దాటికి ప్రజా రవాణ వ్యవస్ద కుప్పకూలిపోయింది.

 Delhi And Telangana States Travelling Passengers Fourteen Days Quarantine-దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం.. అక్కడికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ధిక వ్యవస్ద కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుంది.ఇలాంటి క్లిష్టమైన సమయంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకనుండి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.

ఇదే సమయంలో ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం పొందినవారు, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్‌ చూపించిన వారికి మాత్రం వారం రోజుల హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని తెలియచేసింది.

#Fourteen Days #Quarantine #Delhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు