ఆంధ్రప్రదేశ్ లో దారుణం.... డిగ్రీ చదువుతున్న యువతిపై...  

Degree Student Complaint Against 4 Members In East Godavari - Telugu Degree Student, Degree Student Latest News, Degree Student News, East Godavari Crime News, East Godavari Latest News, East Godavari News

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.తాజాగా డిగ్రీ చదువుకుంటున్న ఓ యువతి తన స్నేహితుడితో సరదాగా మాట్లాడేందుకు వెళ్లగా ఆమెపై మృగాళ్లు లాంటి నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Degree Student Complaint Against 4 Members In East Godavari

వివరాల్లోకి వెళితే జిల్లాలో ఓ యువతి స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో చదువుకుంటోంది.అయితే కాలేజీ అయిపోయిన తర్వాత తన స్నేహితుడితో కలిసి మాట్లాడుకునేందుకు ఏకాంత ప్రదేశం కోసం బయటికి వెళ్లారు.

అయితే మాటల్లో పడి సమయాన్ని మర్చిపోవడం తో అప్పటికే బాగా లేట్ అయింది.దీంతో ఇంటికి వెళ్లాలనుకునే క్రమంలో బయలుదేరుతుండగా స్థానికంగా ఉన్నటువంటి నలుగురు యువకులు యువతి స్నేహితుడి పై దారుణంగా దాడి చేశారు.

దీంతో ఆమె స్నేహితుడు స్పృహ కోల్పోయాడు.ఇదే అదునుగా చూసుకొన్నటువంటి నలుగురు వ్యక్తులు ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.అనంతరం వారిని అక్కడే వదిలి పెట్టి పరారయ్యారు.

దీంతో యువతి వెంటనే తన స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.అలాగే తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి నలుగురు నిందితులపై ఫిర్యాదు నమోదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Degree Student Complaint Against 4 Members In East Godavari Related Telugu News,Photos/Pics,Images..

footer-test