ఈ మధ్య కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.కాగా తాజాగా డిగ్రీ చదివిన ఓ విద్యార్థిని ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడి చివరికి అనుకోకుండా ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే రత్న కుమారి అనే యువతి స్థానిక జిల్లాలోని ఓ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. ఈ యువతి ఇటీవలే డిగ్రీ చదివి ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ఖర్చుల నిమిత్తం స్థానిక పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తోంది.కానీ అనుకోకుండా స్థానిక పట్టణంలో ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది.
అయితే ఈ పరిచయం కాస్త కొద్ది సమయంలోనే ప్రేమకి దారి తీసింది.దీంతో వీరిద్దరూ ఎక్కడికెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్ళు.ఈ క్రమంలో రత్న కుమారి బంధువులు తన ప్రియుడు గురించి ఆరా తీసి అతడికి ఇదివరకే పెళ్లయిందని కాబట్టి ఇకపై అతడితో చనువుగా తిరగద్దని మందలించారు.
దీంతో అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన రత్న కుమారి ఒక్కసారిగా తన ప్రియుడి గురించి నిజాలు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో రత్న కుమారి ప్రాణాలను కోల్పోయింది.
దీంతో మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.