తమ్ముడు తన మాట వినడం లేదని ఆ అక్క ఏం చేసిందో తెలుసా..?

ఈ మధ్య యువత చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువవుతుంది.తల్లితండ్రి మందలించారని, టీచర్ తిట్టాడని, లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని ఇలా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం సర్వసాధారమైపోయింది.

 Degree Student Commits Suicide Due To Fight With Brother-TeluguStop.com

తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.డిగ్రీ చదువుతున్న అమ్మాయి వాళ్ళ తమ్ముడు తన మాటకు ఎదురు చెబుతున్నాడని, ఏ మాట పట్టించుకోవడం లేదని దారుణానికి పాల్పడింది.

అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఆ అమ్మాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆ మంటలు తట్టుకోలేక ఆర్తనాదాలు చేస్తుంటే తల్లిదండ్రులకు మెలుకువ వచ్చి లేచి చూసే సరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంది.

 Degree Student Commits Suicide Due To Fight With Brother-తమ్ముడు తన మాట వినడం లేదని ఆ అక్క ఏం చేసిందో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కూతురు డిగ్రీ చదువుతుండగా.కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.

కూతురు, కొడుకు ఇద్దరు దర్శిలోని ప్రైవేట్ కాలేజ్ లో చదువు కుంటున్నారు.అయితే అక్క, తమ్ముడు ఈ మధ్య చీటికీ మాటికీ గొడవ పడుతున్నారు.

Telugu Crime News, Darshi, Degree Student, Fight With Brother, Prakasam, Srinivasa Rao, Suicide-Latest News - Telugu

బుధవారం రోజు కూడా అక్కా తమ్ముడు ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారు.తాను చెప్పే మాటలను అస్సలు వినిపించుకోవడం లేదని.ప్రతి మాటకు ఎదురు సమాధానం చెబుతున్నాడని బాధ పడుతూ ఉండేది.అంతేకాదు తల్లిదండ్రులు కూడా తననే తప్పు అంటున్నారని ఆవేదనతో దారుణమైన నిర్ణయం తీసుకుంది.అర్ధరాత్రి సమయంలో అందరు నిద్రలోకి జారుకున్నారు.

ఇంట్లో ఉన్న పెట్రోల్ తీసుకుని వంట గదిలోకి వెళ్లి మీద పోసుకుని నిప్పంటిచుకుంది.

ఆ మంటలను భరించలేక పెద్దగా అరవడం మొదలు పెట్టింది.దీంతో తల్లిదండ్రులు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచారు.

వాళ్ళు ఆమె అరుపులు విని వంట గదిలోకి వెళ్ళేలోపు ఆమె మరణించింది.ఆవేశంలో ఇంత దారుణానికి పాల్పడిందని తల్లిందండ్రులు విలపిస్తున్నారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

#Srinivasa Rao #Degree Student #Darshi #Prakasam #Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు