ఇకపై ఆర్మీ కథతో సినిమా తీయడం అంత ఈజీ కాదు… రూల్స్ పాటించాల్సిందే  

no objection certificate must for indian army backdrop movies, Bollywood, Defense Ministry, Indian Army - Telugu Bollywood, Defense Ministry, Indian Army, No Objection Certificate Must For Indian Army Backdrop Movies

ఇండియన్ ఆర్మీ అనేసరికి భారతీయులు అందరికి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది.ఈ నేపధ్యంలోనే ఇండియన్ ఆర్మీ నేపధ్యంలో దర్శకులు కథలు సిద్ధం చేసి తెరపై ఆవిష్కరించారు.

 Defense Ministry Indian Army Army Movies

భారతీయ బాషలన్నింటిలో ఈ కథలతో సినిమాలు వచ్చి సూపర్ హిట్ చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి.ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల నేపధ్యంలో వందల సినిమాలు తెరపైకి వచ్చి ఉంటాయి.

ఇలా వచ్చిన ప్రతి దాంట్లో ఇండియన్ ఆర్మీ జవాన్లు హీరోయిజం చూపిస్తారు.అలాగే అందులోనే కొంత మంది అమ్ముడుపోయినట్లు కూడా చూపిస్తారు.

ఇకపై ఆర్మీ కథతో సినిమా తీయడం అంత ఈజీ కాదు… రూల్స్ పాటించాల్సిందే-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఇలాంటివి చూపించినట్లు శత్రుదేశాలకి కొన్ని రహస్యాలు ఇచ్చినట్లు అవుతుంది.అయితే ఇకపై ఆర్మీపై ఎడాపెడా సినిమాలు తీయడం వీలు కాకపోవచ్చు.

సినిమాలలో కొన్ని సైన్యం ఇమేజ్ ని దెబ్బ తీసే విధంగా కూడా ఉండటంతో రక్షణ శాఖ సినిమాలపై కొన్ని షరతులు పెట్టింది.

ఏ భాషలోనైనా సైన్యం నేపథ్యంలో సినిమా తీయాలంటే ఇకపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

రక్షణశాఖకు ముందుగానే కథ చెప్పి వారిని ఒప్పించాల్సి ఉంటుంది.అంతేకాదు, సినిమా విడుదల సమయంలోనూ రక్షణ శాఖ ప్రతినిధులకు ప్రత్యేక స్క్రీనింగ్ వేయాల్సి ఉంటుంది.వారు సంతృప్తి చెందితేనే ఆ సినిమాకు మోక్షం కలుగుతుంది.అంతేకాదు, ఆర్మీ ఇతివృత్తంతో తెరకెక్కే సినిమాలు ఎన్ఓసీ తీసుకోని పక్షంలో వాటికి సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేస్తారు.

ఈ ఆంక్షలన్నింటికి సిద్ధపడితేనే ఆర్మీ కథతో సినిమా తెరకెక్కుతుంది.అయితే ఆర్మీ కథలలో హీరోయిజం ఉంటుందని చాలా మంది ఇలాంటి కథలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు ఈ కథలని తెరపై ఆవిష్కరించాలంటే ఇన్ని షరతుల మధ్య కాస్తా కష్టమని చెప్పాలి.ఈ నేపధ్యం దర్శక, నిర్మాతలు ఇకపై ఆర్మీ కథల జోలికి వెళ్ళడం చాలా వరకు తగ్గించేసే అవకాశం ఉంది.

#Indian Army

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Defense Ministry Indian Army Army Movies Related Telugu News,Photos/Pics,Images..