ఇదెక్కడి పులిహోర మావా : లేడీ జడ్జి తో కోర్టులోనే పులిహోర కలిపి ఐ లవ్ యూ చెప్పిన దొంగ...

మామూలుగా అప్పుడప్పుడు కొంత మంది సందు దొరికితే చాలు అమ్మాయిలతో పులిహోర కలిపేస్తూ, ఎలాగైనా వారిని ప్రేమలోకి దింపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలో కొందరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు సఫలీకృతం అయితే మరికొందరు మాత్రం అప్పుడప్పుడు అనుకోని పరిణామాలను ఎదుర్కొంటుంటారు అది వేరే విషయం అనుకోండి.

 Defendant Try To Flirt With Broward Judge During Bond Court Appearance,  Broward-TeluguStop.com

 అయితే తాజాగా దొంగతనం చేస్తూ పోలీసులకి దొరికిపోయిన ఓ దొంగని కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జిమెంట్ చెప్పిన లేడీ జడ్జి అందానికి ఫిదా అయ్యి ఏకంగా ఆమెకి మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఫ్లోరిడా పరిసర ప్రాంతంలో లూయిస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఇతడు అప్పుడప్పుడు నగరంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. అయితే తాజాగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి పోలీసులకు చిక్కాడు.దీంతో లూయిస్ ని పోలీసులు సంబంధిత పట్టణ జూమ్ వీడియో కాల్ ద్వారా  ఆన్ లైన్  కోర్టులో ప్రవేశపెట్టారు.

దీంతో లూయిస్ ఏకంగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జి అందానికి ఫిదా అయి ఆమెతో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మీరు చాలా అందంగా ఉన్నారని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అంటూ ఏకంగా ప్రపోజ్ కూడా చేశాడు.

దీంతో ఆ లేడీ జడ్జి చిన్నగా నవ్వుతూ ఇలాంటి పొగడ్తలకి తాను పడనని,  అంతేగాక దొంగతనం కేసులో పట్టుబడినందుకుగాను $5000 పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.దీంతో లూయిస్ కి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది.

అయితే ఆన్ లైన్ ద్వారా లూయిస్ ను కోర్టులో హాజరు పరిచిన సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

కాగా  కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ జడ్జికి ప్రపోజ్ చేశాడంటే సాహసమనే చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరయితే ఇదెక్కడి “పులిహోర మిక్సింగ్ మావా” అంటూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫోటోతో మీమ్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube