కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనావైరస్ సోకింది.ఆయన ట్వీట్ ద్వారా ఈ సమాచారం తెలియ‌జేశారు.

 Defence Minister Rajnath Singh Tests Positive For Covid-19 With Mild Symptoms,de-TeluguStop.com

రాజ్‌నాథ్ సింగ్.తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు.

తేలికపాటి లక్షణాలతో త‌న‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింద‌ని, ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని, ఇటీవల త‌న‌ను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు.కాగా భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి.

ఆదివారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా కరోనా సోకింది.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా చాలా మంది మంత్రులు, నేత‌లు కూడా క‌రోనా బారిన పడ్డారు.

కాగా దేశంలో సోమవారం ఒక్కరోజే కొత్త‌గా 1,79,723 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 3,57,07,727కి చేరుకుంది.ఇప్పటివరకు, 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 4,033 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619కి పెరిగింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 1,216 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.రాజస్థాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236 కేసులు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube