చావును కొని తెచ్చుకున్న జింక...వైరల్ వీడియో

మొసలి నీటిలో ఎంత బలంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.మొసలి చేతికి ఒక్కసారి చిక్కామంటే ఇక మరల మనుషులైనా, జంతువులైనా బ్రతికి బట్ట కట్టడం సాధ్యం కాదు.

 Deer That Bought Death Viral Video-TeluguStop.com

అంతలా అవి నీటిలో బలంగా ఉంటాయి.నీటిలో మొసలి ఉన్న విషయం గమనించడం అసాధ్యం.

ఒకవేళ ఉన్నా కూడా దాడి చేయబోయే జంతువుకు ఏమాత్రం అనుమానం రాకుండా ఒక్కసారిగా అకస్మాత్తుగా విరుచుకబడుతుంది.ఎక్కువగా అడవిలో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి.

 Deer That Bought Death Viral Video-చావును కొని తెచ్చుకున్న జింక…వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జింకలు తమ దాహార్తి తీర్చుకోవడం కోసం నీటి కొలనుల దగ్గరకు వస్తుంటాయి.అప్పుడే మొసళ్ళు అదును చూసి జింకలపై దాడి చేస్తుంటాయి.

అయితే ఏమరుపాటుగా ఉన్నప్పుడు జింకలు దాడికి గురైతే ఒక విషయం అనుకోవచ్చు.

కాని జింక మూర్ఖత్వంతో మొసలి బారిన పడింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే నీటిలో మొసలి ఉందని గమనించిన జింక, నీటి నుండి జింకపై దాడి చేయడానికి మొసలి వస్తుందని గమనించిన జింక, ఒక మొసలి మాత్రమే ఉందనుకొని నీటిలో దూకింది.

కాని దురదృష్టమేంటంటే ఆ నదిలో అప్పటికే ఇంకొక మొసలి ఉంది.అయితే జింక నీటిలో దూకిందని గమనించిన మొసలి వెంటనే ఒడ్డుపై నుండి నీటిలోకి వెళ్లి జింకపై దాడి చేసింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు జింక తప్పించుకోవాలని కోరుకోవడం గమనార్హం.

దీనిని బట్టి మనం అప్పుడప్పుడు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలతో మనకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు

.

#Crcodile #Viral #ViarlVideos #Two Crocodiles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు