వ్యాక్సిన్ వేయించుకుంటూ దీప్తి సునయన, శివజ్యోతి ఓవర్ యాక్షన్.. ట్రోల్స్?

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఉండేసరికి ప్రతి ఒక్కరు తమ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు.

 Deepti Sunayana Shivajyoti Over Action Trolls, Deepthi Sunaina, Covid Vaccine, S-TeluguStop.com

ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వేదికగా మార్చుకొని పంచుకుంటున్నారు.ఇక ఈ మధ్య వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.ఇక కొందరు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ ఫోటోలు, వీడియోలను చేయించుకుంటున్నారు.

వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.తాజాగా మరో సెలబ్రిటీ దీప్తి సునయన వ్యాక్సిన్ తీసుకోగా బాగా ఓవర్ చేయడంతో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.అంతే కాకుండా తనతో పాటు వచ్చిన యాంకర్ శివ జ్యోతి కూడా కాస్త ఓవర్ గా స్పందించడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

వ్యాక్సినేషన్ కోసం వెళ్ళిన దీప్తి సునయన ఏదో తింటూ ధైర్యంగానే వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళింది.

తీరా వ్యాక్సిన్ సూదిని చూసేసరికి భయపడి నేను వేయించుకోను కాస్త మారం చేసింది.అప్పుడే పెట్టొద్దు బ్రో హ హ హ అంటూ కాస్త ఓవర్ గా రియాక్ట్ అవడంతో పక్కనే ఉన్న శివ జ్యోతి ఏడుస్తారా ఎవరైనా.

దీని చేతులు చల్లబడి పోయాయి పాపం.బుజ్జి తల్లి అయిపోయింది అని తన పర్ఫార్మెన్స్ తో కూడా బాగా అదరగొట్టింది.

ఇక ఈ వీడియోని దీప్తి సునయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు.ఏమ్ ఉన్నారమ్మ.ఒకరిని మించి ఒకరు.మీ ముందు మహానటులు బలాదూర్.వ్యాక్సిన్ వేయించుకోవడం ఇంత బిల్డప్ అవసరమా అంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ఎదురవడంతో వెంటనే వీడియోని డిలీట్ చేసింది దీప్తి సునయన.

కాని దీప్తి షేర్ చేసిన వెంటనే ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అవ్వడంతో రెట్టింపు కామెంట్స్ ఎదుర్కొంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube