ప్రేమపై షాకింగ్ కామెంట్లు చేసిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ ను టార్గెట్ చేస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఎన్నో జోడీలకు గుర్తింపు ఉంది.అలా గుర్తింపును సొంతం చేసుకున్న జోడీలలో దీప్తి సునైనా షణ్ముఖ్ జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

 Deepti Sunaina Shocking Comments About Love Details, Deepthi Shunaina, Deepthi Sunaina Comments, Shanmukh Jaswanth, Agent Anand Santosh, Deepthi Sunaina Career, Virataparvam, Siri, Deephti Sunaina Love-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షో వల్ల ఈ జోడీ విడిపోయింది.బిగ్ బాస్ షోలో సిరితో షణ్ముఖ్ చనువుగా ఉండటంతో దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పి అభిమానులకు ఊహించని స్థాయిలో భారీ షాకిచ్చింది.

దీప్తి సునైనా షణ్ముఖ్ కలుస్తారని అందరూ భావించినా వీళ్లిద్దరూ కలిసే అవకాశం కనిపించడం లేదు.

 Deepti Sunaina Shocking Comments About Love Details, Deepthi Shunaina, Deepthi Sunaina Comments, Shanmukh Jaswanth, Agent Anand Santosh, Deepthi Sunaina Career, Virataparvam, Siri, Deephti Sunaina Love-ప్రేమపై షాకింగ్ కామెంట్లు చేసిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ ను టార్గెట్ చేస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ షో తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ తో బిజీ అయ్యారు.

ఏజెంట్ ఆనంద్ సంతోష్ పేరుతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుండగా ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.గతంలో షణ్ముఖ్ జశ్వంత్ నటించిన పలు వెబ్ సిరీస్ లు రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోగా ఈ వెబ్ సిరీస్ కూడా అంచనాలను మించి సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Anand Santosh, Deephtisunaina, Deepthisunaina, Deepthi Sunaina, Deepti Sunaina, Love, Siri, Virataparvam-Movie

అయితే దీప్తి సునైనా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో విరాటపర్వం సినిమాకు సంబంధించిన డైలాగ్ ను పంచుకున్నారు.“ఎవరిని ఎవరు ప్రేమించరని మనల్ని మనం ప్రేమించుకోవడం నిజం అని ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది పెద్ద అబద్ధం” అని సినిమా డైలాగ్ ను దీప్తి సునైనా పంచుకున్నారు.ప్రేమపై నమ్మకం పోయిందని దీప్తి సునైనా క్లారిటీ ఇచ్చేశారు.

Telugu Anand Santosh, Deephtisunaina, Deepthisunaina, Deepthi Sunaina, Deepti Sunaina, Love, Siri, Virataparvam-Movie

దీప్తి సునైనా గతంతో పోలిస్తే సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు.దీప్తి సునైనా మళ్లీ యాక్టివ్ గా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.దీప్తి సునైనా ఇప్పటికే పలు సినిమాలలో నటించారు.దీప్తి సునైనా సినిమాలలో ఎక్కువగా నటించి సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటే ఆమె కెరీర్ కూడా పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube