ఈ విషయం నాకు తెలీదుగా.. ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన దీప్తి సునయన?

తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట టిక్ టాక్ వీడియో ద్వారా, డబ్ స్మాష్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

 Deepthi Sunaina Reaction Her Tollywood Debut Rumours Post Inside , Deepthi Sunai-TeluguStop.com

ఇక తనకున్న క్రేజ్ తోనే బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ కు సైతం గురవుతూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఇటీవలే దీప్తి సునయన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్, ఆమె విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఇకపై తమ దారులు వేరు అంటూ ఐదేళ్ల రిలేషన్ షిప్ కు ముగింపు పలికింది.ఇక బ్రేకప్ చెప్పిన తర్వాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా త్వరలోనే దీప్తి సునైనా హీరోయిన్ గా కూడా పరిచయం కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అదే విషయంపై స్పందించిన దీప్తి సునైనా అది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది.ఇది ఇలా ఉంటే ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేస్తూ నేను హీరోయిన్ గా చేస్తున్నానా? ఈ విషయం నాకు తెలియదే అంటూ సెటైర్ వేసింది.ఇక దీప్తి సునైనా షేర్ చేసిన ఆ ఫోటో తో ఆమె వెండితెరకు పరిచయం అన్న వార్త లో నిజం లేదని తేలిపోయింది.ఇకపోతే దీప్తి సునైనా ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ బ్రేక్ అప్ ని యాక్సెప్ట్ చేయలేదు.

దీప్తి సునైనా తో మళ్లీ కలవాలని చూస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే దీప్తి సునైనా ఇటువంటి పోస్టులు పెట్టిన కూడా అందుకు పెద్దగా స్పందించడం లేదు.

అయితే దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ల బ్రేకప్ లకు కారణం షణ్ముఖ్ జస్వంత్, సిరి బిగ్ బాస్ లో చేసిన అరాచకాలు అని తెలుస్తోంది.

Deepthi Sunaina Reaction On Her Tollywood Debut Rumors

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube