బిగ్‌బాస్‌లో సునయన జట్టు కత్తిరించుకోవడం, లవ్‌పై తల్లిదండ్రుల కామెంట్స్‌     2018-07-11   22:15:30  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతుంది. మొదటి సీజన్‌ మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో రెండవ సీజన్‌ భారీ అంచనాల నడుమ ప్రారంభం అయ్యింది. ఆరంభంలో కాస్త మెల్లగా, నిద్రపోయినట్లుగా గడిచినప్పటికి తాజాగా మాత్రం జోరు పెరిగింది. ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను భారీ ఎత్తున ఆధరిస్తున్నారు. ఈ సమయంలోనే ఇంట్లో సభ్యుల వ్యవహారాలపై ప్రేక్షకులు ఒక కన్నేసి ఉంచుతున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరి దృష్టిని నలుగురు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు.

ఆ నలుగురు ప్రేమలో పడి తేలుతున్నారు అనిపిస్తుంది. బిగ్‌బాస్‌ ఇంట్లో ప్రస్తుతం ఉన్న తనీష్‌ మరియు దీప్తి సునయనల గురించి ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇద్దరి మద్య అసలేం జరుగుతుంది అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. అర్థరాత్రి సమయంలో సునయన వెళ్లి తనీష్‌కు ముద్దు పెట్టడం, తనీష్‌ కోసం జట్టు కట్‌ చేసుకోవడం, తనీష్‌ వెంటే ఎక్కువగా ఉండటం వంటివి చేస్తున్న కారణంగా ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో సునయన తల్లిదండ్రులు స్పందించారు.

Deepthi Sunaina Parents Response On Big Boss Show-

Deepthi Sunaina Parents Response On Big Boss Show

ఒక ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌తో వారు మాట్లాడుతూ సునయన చిన్న అమ్మాయి, తమ కూతురు బిగ్‌బాస్‌ ఇంట్లో ఏం చేసినా కూడా గేమ్‌లో భాగంగానే చేస్తుందని, తనపై మాకు ఎలాంటి కోపం లేదని, అన్ని తెలిసిన అమ్మాయి తమ కూతురు, ఖచ్చితంగా తప్పు చేయదనే నమ్మకంతో ఉన్నాం. చిన్నప్పటి నుండి తనకు మేము ఫ్రీడం ఇచ్చాడు. ఆ ఫ్రీడంను ఆమె ఎప్పుడు కూడా వృదా చేసుకోలేదు. బిగ్‌బాస్‌ ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి పలువురు పలు రకాలుగా అంటున్నారు. కాని మేం మాత్రం తమ కూతురు పట్ల విశ్వాసంగా ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.

ఎంతైనా సునయన తమ కూతురు కాబట్టి వారు నమ్మకంగానే ఉన్నాం, సునయన ప్రేమకు దూరంగా ఉంటుందని చెబుతున్నారు కాని, షోను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్తుందని, ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారం సాగడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి దీప్తి సునయన వల్ల బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. మరోవైపు సామ్రాట్‌ మరియు తేజస్విలు కూడా ప్రేమలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వీరిద్దరి వ్యవహారం కూడా ఈమద్య కాస్త ఎక్కువగా అనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. షో పూర్తి అయ్యే వరకు ఈ వ్యవహారాలు ఇంకెంత దూరం కొనసాగుతాయో చూడాలి.