అదంతా దేవుడుకే తెలియాలి.. దీప్తి సునయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

యూట్యూబ్ ద్వారాఎన్నో వీడియోలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఎన్నో హిట్ వెబ్ సిరీస్ లలో నటించారు.

 Deepthi Sunaina On Her Behaviour Funny Post , Deepthi Sunaina , Funny Post , Big-TeluguStop.com

ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ఈ జంటను విడదీసి ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో ఎంతో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరూ పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.ఈ క్రమంలోనే దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విధంగా షణ్ముఖ్ జస్వంత్ కు బ్రేకప్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.ఇక బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తన జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ తో కలిసి పెళ్లిళ్లు, పార్టీలు అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తోంది.అదేవిధంగా పూర్తిగా తన ఫోకస్ తన కెరియర్ పెట్టడమే కాకుండా సమంత బాటలో పయనిస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో కొటేషన్లను షేర్ చేస్తూ ఉంది.

దీప్తి సునయన మాత్రం బ్రేకప్ తర్వాత లైఫ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తుండగా షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ప్రేమ విఫలమైన బాధలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే స్టార్ మా వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రసారం చేసే బిగ్ బాస్ జోడి కార్యక్రమంలో భాగంగా పలువురు బుల్లితెర జోడీలు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా షణ్ముఖ్ జశ్వంత్ మై లవ్ ఈజ్ గాన్ అనే పాటకు స్టెప్పులు వేశాడు.దీన్ని బట్టి చూస్తుంటే ఈయనకి బ్రేకప్ అవడంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదే ఈవెంట్ కోసం దీప్తి సునయన కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ కోసం ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Big Boss Jodi, Bigg Boss, Deepthi Sunaina, Maa Day, Web, Youtube-Movie

ఇలా బ్రేక్ అప్ తర్వాత వీరిద్దరూ బిగ్ బాస్ జోడి వేదికపై కలవనున్నట్లు తెలియడంతో ఈ వేదికపై అయినా వీరిద్దరూ మాట్లాడతారా లేదా అనే విషయం గురించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే సమంత తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కొటేషన్స్ షేర్ చేశారు.నేను మాట్లాడే ముందు ఆలోచించను.ఒక్కోసారి నేను మాట్లాడేటప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతుంటారు.నేను కూడా అదే విధంగా ఆశ్చర్యపోతుంటాను అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు.

Telugu Big Boss Jodi, Bigg Boss, Deepthi Sunaina, Maa Day, Web, Youtube-Movie

ఈ కొటేషన్ దీప్తి సునయన కూడా షేర్ చేస్తూ… ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికి ఎరుక అంటూ దీప్తి సునయన చెప్పుకొచ్చారు.ఈ విధంగా దీప్తి సునయన కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక దీప్తి సునయన ఉన్నఫలంగా ఇలాంటి కొటేషన్ షేర్ చేయడానికి గల కారణం ఏమిటి?షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన బిగ్ బాస్ జోడి కార్యక్రమంలో భాగంగా ఇద్దరు కలవబోతున్నారా అందుకే దీప్తి ఈ విధమైనటువంటి కామెంట్ చేశారు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే ఫిబ్రవరి 13వ తేదీ వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube