యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని, వరుస వెబ్ సిరీస్ లు, వీడియో సాంగ్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ఒకరు అని చెప్పవచ్చు.వీరిద్దరూ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా ఈ జంటకు సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ సిరితో చనువుగా ఉండటం వల్ల షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన మధ్య వ్యవహారం చెడిందని చెప్పవచ్చు.
ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ పై పూర్తిగా నెగిటివిటీ రావడంతో దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పింది.
ఇలా ఈ జంట బ్రేకప్ చెప్పడంతో ఎంతోమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.అయితే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన ఎప్పటికైనా కలుస్తారనే ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.ఈ విధంగా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకొన్న తర్వాత ప్రతి ఒక్కరూ దీప్తి సునైనా సోషల్ మీడియా ఖాతాలపై ఎంతో దృష్టి సారించారు.

సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన చేసే ప్రతి ఒక్క పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారుతుంది.ఇక షణ్ముఖ్ జస్వంత్ జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న దీప్తి సునయన తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనుకుంటే అందరికంటే ఎక్కువగా నేను అర్థం చేసుకోగలను కానీ నేను గుడ్డిదాన్ని ఏమి కాదు అంటూ ప్రస్తుతం తన సిచువేషన్ కి అనుగుణంగా పోస్ట్ చేశారు.
ఇలా దీప్తి సునయన కామెంట్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఇది షణ్ముఖ్ జస్వంత్ ను ఉద్దేశించి చేసిన పోస్ట్ కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.