తనీష్‌, దీప్తి సునయనల మద్య వ్యవహారం నడుస్తోంది.. ఇదేం సాక్ష్యం     2018-07-09   23:13:28  IST  Raghu V

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 వారాలు గడుస్తున్న కొద్ది రసవత్తరంగా మారుతుంది. తాజాగా ఇంటి నుండి శ్యామల చాలా ఎమోషనల్‌గా వెళ్లి పోయిన విషయం తెల్సిందే. శ్యామల వెళ్లి పోయిన తర్వాత ఇంట్లో కాస్త గంభీర వాతావరణం నెలకొన్నప్పటికి అది సోమవారం నుండి మామూలు పరిస్థితిలోకి మారిపోయింది. సోమవారం ఎలిమినేషన్‌ పక్రియ జరిగింది. ఎప్పటిలా కాకుండా విభిన్నంగా ఎలిమినేషన్‌ కార్యక్రమంను బిగ్‌బాస్‌ నిర్వహించాడు. ప్రతి పార్టిసిపెంట్‌ కోసం మరో పార్టిసిపెంట్‌ ఏదైనా త్యాగం చేస్తే ఆ పార్టిసిపెంట్‌ సేఫ్‌ అవుతాడు. అలా ఒకరికొకరు సాయంగా, ఒకరినొకరు ఆదుకునేలాగా ఎలిమినేషన్‌ కార్యక్రమం జరిగింది.

తనీష్‌ ఎలిమినేషన్‌లో ఉన్న సమయంలో దీప్తి సునయనా తన జుట్టును బుజాల వరకు కట్‌ చేసుకోవాల్సి వచ్చింది. దీప్తి ఖచ్చితంగా జుట్టును కట్‌ చేసుకోదని అంతా భావించారు. బాబు గోగినేని కూడా దీప్తి సునయనకు వద్దు అంటూ హెచ్చరించాడు. జట్టు కట్‌ చేసుకుంటే వెంటనే తిరిగి రాదని, తనీష్‌ ఎలిమినేషన్‌లో ఉంటే ఒక వేళ ప్రేక్షకుల ఓటింగ్‌ ద్వారా ఆయన ఇంట్లోనే కొనసాగే అవకాశం ఉంటుందని బాబు అభిప్రాయ పడ్డాడు. అయితే దీప్తి సునయన మాత్రం కాస్త ఆలోచించి జట్టు కత్తిరించుకునేందుకు సిద్దం అయ్యింది. దీప్తి జట్టు కత్తిరించుకోవడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

తనీష్‌పై దీప్తి ప్రత్యేకమైన శ్రద్దను కనబర్చుతుంది అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా తనీష్‌ వెంటే దీప్తి ఉండటంతో పాటు, అర్థరాత్రి సమయంలో దీప్తి సునయన తనీష్‌ వద్దకు వెళ్లి ముద్దు పెట్టడం కూడా అందరికి విష్మయాన్ని కలిగించింది. దీప్తి సునయన మరియు తనీష్‌ల మద్య ప్రేమ వ్యవహారం జరుగుతుందని బిగ్‌బాస్‌ చూస్తున్న ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఇద్దరు కూడా ఎక్కువ శాతం కలిసి ఉండటంతో పాటు, కలిసి తినడం, కలిసి ఏదైనా పని చేయడం జరుగుతుంది. దాంతో ఇద్దరి మద్య ఖచ్చితంగా వ్యవహారం ఉంది అని అనుకుంటున్నారు.

తాజాగా తనీష్‌ కోసం దీప్తి తనకు ఎంతో ఇష్టమైన జట్టును కట్‌ చేయించుకుంది. సాదారణ వ్యక్తులు జుట్టు కట్‌ చేయించుకునేందుకు ఆలోచిస్తారు. ఇక అదే సెలబ్రెటీలు అయితే జట్టును కట్‌ చేయించుకునేందుకు వంద శాతం ఒప్పుకోరు. కాని దీప్తి మాత్రం కాస్త ఆలోచించి వెంటనే తనీష్‌ కోసం తనకు ఇష్టమైన జుట్టును కత్తిరించేసుకుంది. తనీష్‌పై ఇష్టంతోనే దీప్తి సునయన జుట్టును కత్తించుకుందని, ఇద్దరి మద్య ప్రేమకు ఇదే సాక్ష్యం.

ఇక ఇదే హౌస్‌లో తేజస్వి మరియు సామ్రాట్‌ల మద్య కూడా వ్యవహారం సాగుతుంది. తేజస్వి కోసం సామ్రాట్‌ తన గడ్డంను త్యాగం చేసేశాడు. మొత్తానికి బిగ్‌బాస్‌లో ఈసారి జంటలు, ప్రేమలు, స్నేహాలు, ఎమోషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో టీవీ9 దీప్తి, గణేష్‌ మరియు భానుశ్రీలు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఆదివారం నాడు ఎలిమినేషన్‌ అయ్యే అవకాశం ఉంది. అతి తక్కువమంది నామినేట్‌ అయ్యారు.