బిగ్ బాస్ హౌస్ లోనే కాదు...బయటకూడా కాస్ట్, లోకల్ ఫీలింగ్ తో ప్రచార పోటీ..!       2018-06-30   22:21:22  IST  Raghu V

మీది తెనాలి మాది తెనాలి అనే డైలాగ్ ఇంద్ర సినిమాలో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు మన బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్. మీది బెజవాడే మాది బెజవాడే టైపులో పాపం, హౌజులో అక్కా, తమ్మీ అనుకుంటూ సహకరించేసుకుంటున్నారు కూడా… కానీ ఇప్పుడు ఓ రెడ్డి అమ్మాయి, అదీ తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా హైదరాబాదులో సపోర్ట్ ఫ్లెక్సీలు వెలుస్తున్నయ్.

ఇంస్టాగ్రామ్ ,డబ్ స్మాష్ ..ల ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ షో కి ఎంపిక అయినా ‘ దీప్తి సునైనా’ బాగానే పాపులర్ అయ్యింది. అంతే కాదు అటు బిగ్ బాస్ షో లో కూడా అదరగొడుతుంది.. ఇది లా ఉండగా ఈ సారి బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ ఎంపిక మీద తీవ్ర విమర్శలు వెల్లువ ఎత్తాయి .. ఎందుకు అంటే ఎక్కువ శాతం ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినవారిని ఎంపిక చేసారు అనే విమర్శలు ఎక్కువ అయ్యాయి … బెజవాడ లోని ఒక అభిమాని ఎలాంటి బ్యానర్ వేయించాడో తెలుసా ?

సాధారణంగా సినిమా హీరోలకి , రాజ కీయ నాయకులకి బ్యానర్ లు ఫెక్సీలు కట్టడం చూసాం కానీ ఒక బిగ్ బాస్ షో కాంటెస్ట్న్ట్ కోసం మొదటి సారి ఇలా ఫ్లెక్సీ వేసి మరి సపోర్ట్ చేయడం ఇదే మొట్ట మొదటి సారి.

శివబాలాజీ విజయానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వేసిన వోట్లే కారణమంటారు… సో, బిగ్‌బాస్ షో అనేది కేవలం తెర మీద వినోదమే కాదు, అది హౌజు బయట కలకలం కూడా..! ఫ్యాన్స్ సందోహం కూడా..!

దీప్తి సునైనా అసలు పేరు దీప్తి రెడ్డి… కండ్రేగుల షణ్ముఖ జస్వంత్ అనే అబ్బాయితో అఫైర్ ఉన్నట్టు వార్తలొచ్చాయి కానీ దాన్ని బ్రేకప్ చేసుకున్నట్టు కూడా మొన్నామధ్య చెప్పినట్టుంది ఈమె… కిరాక్ పార్టీ అనే సినిమాలో యాక్ట్ చేసింది